నీ యమ్మ మొగుడిస్తాడా.. ఎలుకను రూమ్‌లో బంధించి చిత్రహింసలు పెట్టిన వ్యక్తి(వీడియో)

by Disha Web Desk 9 |
నీ యమ్మ మొగుడిస్తాడా.. ఎలుకను రూమ్‌లో బంధించి చిత్రహింసలు పెట్టిన వ్యక్తి(వీడియో)
X

దిశ, ఫీచర్స్: గ్రామం, నగరం అనే తేడా లేకుండా ఎలుకలు ఇంట్లో ఉన్న బట్టలు, ఆహారం, పుస్తకాల నంచి ప్రతిదీ పాడు చేస్తుంటాయి. ఇంట్లో సరుకులు పెట్టే ప్లాస్టిక్ మూతలు కొరికేస్తుంటాయి. బీరువాల్లోకి వెళ్లి బట్టలు కొరికేస్తాయి. ఇంట్లో అందరూ పడుకున్నాక.. ఆహారం కోసం కిచెన్ లోకి వెళ్లి రచ్చ రచ్చ చేస్తుంటాయి. మన కళ్లముందే నుంచే చెంగుచెంగున గెంతుకుంటూ వెళ్లినప్పుడు ఏం సమస్యుండదు. అవి కనిపించకపోతేనే సమస్య. ఎక్కడున్నాయో.. ఏం ఏం వస్తువులు పాడుచేస్తున్నాయో అని ఓ టెన్షన్.

ఇంట్లో ఎలుకలు ఉంటే మనశ్శాంతి ఉండదు. ఎలుకల బెడద నుంచి పూర్తిగా బయటపడాలంటే దుకాణంలో కొన్ని రకాల ఉత్పత్తులు కొని ఉపయోగిస్తారు. ఎలుకలకు రాకుండా ఉండేందుకు మరికొంతమంది మందు పెడుతుంటారు. అయితే తాజాగా ఓ ఎలుక చేసిన పనికి ఓ వ్యక్తి ఎలుక చిత్ర హింసలు పెట్టిన ఘటన సోషల్ మీడియాలోని జనాలను కలచివేస్తుంది. ఎలుకను గదిలో ఒక మనిషిలా బంధించి.. రెండు చేతులను దారంతో ఫ్యాన్స్ కట్టాడు. అనంతరం ప్రశ్నల వర్షం కురిపిస్తూ తన శాడిజం చూపించాడు.

‘‘టమాటాలు తిన్నావు వదిలేశాను. పుస్తకాలు కొరికేసిన కూడా ఏమనలేదు. ఇప్పుడు బ్లూటూత్ ఎందుకు కొరికావు. ఇది నా ఫ్రెండ్ బ్లూటూత్. దీని ధర 2 వేల రూపాయలు. రెండ్రోజులు వాడుకుందామని తెచ్చుకుంటే నువ్వు ఎందుకు పాడు చేశావు. ఇప్పుడు ఈ బ్లూటూత్ కు డబ్బులు నీ అమ్మ మొగుడిస్తాడా?’’ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు బాబోయ్.. ఇదేం శాడిజం రా బాబు. ఎలుకను బంధించడం ఏంటి? పాపం నోరులేని జీవిని హింసించడం ఏ మాత్రం నీకు తగదు అంటూ ఆ వ్యక్తిపై మండిపడుతున్నారు.


Next Story