- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RTC: ఆర్టీసీ బస్సు ఆపేందుకు ప్లాన్... చేతిలో బండరాయి పట్టుకొని !
ఆర్టీసీ బస్సు ( RTC Bus) అంటేనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ( Telangana) ఉచితంగా మహిళలకు ఆర్టీసీ

దిశ, వెబ్ డెస్క్: ఆర్టీసీ బస్సు ( RTC Bus) అంటేనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ( Telangana) ఉచితంగా మహిళలకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం... కల్పించిన తర్వాత.. రద్దీ మరింత పెరిగింది. చాలా మంది ఉచిత ప్రయాణాన్ని వాడుకుంటూ... తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. అయితే ఈ ఉచిత బస్సు కారణం వల్ల... చాలా మంది పురుషులకు సీట్లు దొరకడం లేదనే వాదన వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ నేపథ్యంలోనే... ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరీంనగర్ పట్టణంలోని ఓ గ్రామం వద్ద.. స్టేజి దగ్గర కొంత మంది మహిళలు ఉన్నారు. అటు ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత.. మహిళలు ఉంటే బస్సులు ఆపడం లేదనే వాదన తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని గ్రహించిన వ్యక్తి.. ఆ మహిళల కోసం పెద్ద సాహసమే చేశాడు.
సాధారణంగా బస్సు ఆపితే డ్రైవర్ ఆపబోడని... అందుకే పెద్ద బండరాయి చేతిలో పట్టుకొని వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.. ఇక బస్సు వస్తున్న నేపథ్యంలో నడిరోడ్డు పైకి వెళ్లి బండపైకి ఎత్తి చూపాడు. ఇక అతడి పిచ్చి వేషాలు చూసిన డ్రైవర్... అలర్ట్ అయి వెంటనే బస్సును ఆపాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. వీడెవడండీ బాబు.. బస్సును ఇలా కూడా ఆపుతారా..? అంత పెద్ద బండరాయి తీసుకువస్తే.. జనాలు ఎందుకు ఆపడం లేదని ఫైర్ అవుతున్నారు. ఒకవేళ ఆర్టీసీ బస్సు ఆపకపోతే అతడు బండరాయితో కొట్టేవాడని కొంతమంది చెబుతున్నారు.
Instagram link






