- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు... ఆ పుల్లలే కొరికేశాడు !
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని.. మనం ఎప్పుడూ చూడని

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని.. మనం ఎప్పుడూ చూడని వీడియోలో వస్తాయి. అయితే ముఖ్యంగా మందుబాబులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఫుల్లుగా తాగాక... మందుబాబులు చేసే పనులు అంతా ఇంతా కాదు. ఇల్లు పీకి పందిరి వేస్తారు.. బాగా తాగిన తర్వాత కరెంటు పోల్ కూడా ఎక్కిన సంఘటనలు మనం చూసాం.
అయితే.. తాజాగా ఓ మందుబాబు... డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ (Drunk and drive test ) చేసేటప్పుడు చేసిన రచ్చ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన హైదరాబాద్ లో ( Hyderabad) జరిగినట్లు తెలుస్తోంది. ఓ మందుబాబు కారు డ్రైవ్ చేస్తూ... పోలీసులకు దొరికాడు. దీంతో అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. ఇందులో భాగంగానే... టెస్ట్ చేసే పుల్లలు అతని నోట్లో పెట్టారు పోలీసులు.
అయితే.. టెస్ట్ చేసినప్పుడు.. ఊదాల్సింది పోయి... ఆ పుల్లలను కొరికేశాడు. పోలీసులు ఎంత చెప్పినా కూడా.. అలాగే వింతగా ప్రవర్తించాడు. నేను తాగలేదు సార్.. అంటూ వాళ్లపై తిరగబడే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి.. గట్టిగానే కోటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ తప్పించుకోడానికి అదిరిపోయే ప్లాన్ వేశాడు మనోడు అంటూ అతన్ని మెచ్చుకుంటున్నారు.
instgramme Link






