ఒక చేతిలో మందు గ్లాస్.. మరో చేతిలో సిగరెట్.. భారీ ట్రాఫిక్.. నడిరోడ్డులో కూర్చుని మందుబాబు జల్సా.. (వీడియో)

by Sujitha Rachapalli |

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. ప్రతీ స్క్రోల్‌కు ఓ కొత్త కంటెంట్ కనిపిస్తుంది. ప్రాణాల మీదకు తెచ్చే స్టంట్స్, నవ్వించే జోక్స్, కవ్వించే రొమాంటిక్ వీడియోలు, మేకప్, చిన్నారుల క్యూట్ క్లిపింగ్స్.. ఒక్కటేమిటీ ఎంత

ఒక చేతిలో మందు గ్లాస్.. మరో చేతిలో సిగరెట్.. భారీ ట్రాఫిక్.. నడిరోడ్డులో కూర్చుని మందుబాబు జల్సా.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. ప్రతీ స్క్రోల్‌కు ఓ కొత్త కంటెంట్ కనిపిస్తుంది. ప్రాణాల మీదకు తెచ్చే స్టంట్స్, నవ్వించే జోక్స్, కవ్వించే రొమాంటిక్ వీడియోలు, మేకప్, చిన్నారుల క్యూట్ క్లిపింగ్స్.. ఒక్కటేమిటీ ఎంత నొక్కితే అంత కంటెంట్ వచ్చేస్తుంది. కానీ వీటిలో కొన్ని మాత్రమే వైరల్ అయిపోతాయి. కారణం యూనిక్‌నెస్. ఇక ఈ అంకుల్ వీడియో కూడా అలాంటిదే.

భారీ ట్రాఫిక్.. రణగొణ ధ్వనులు.. చుట్టూ జనాలు ఎవరి పనుల్లో వారు బిజీ.. నాలుగు రోడ్ల కూడలి.. ఒక చేతిలో మందు గ్లాస్.. మరో చేతిలో సిగరెట్.. హాయిగా రోడ్డుమీద కూర్చుని ఎంజాయ్ చేస్తున్న ఓ అంకుల్. ఇంత కూల్‌గా లైఫ్ ఎంజాయ్ చేయడాన్ని వీడియోల్లో క్యాప్చర్ చేసిన జనాలు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయిపోయింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అంకుల్ ఆరా’ మామూలుగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story