బెంగ‌ళూరులో దారుణం..బైక‌ర్ ను ఢీ కొట్టి, 500 మీట‌ర్ల వ‌ర‌కు గాల్లోనే !

by velandi.Saikiran |   (  Updated:2026-02-11 22:30:44  IST  )

బెంగళూరులో ఉన్న ఓ కాలనీలో బైకర్ ను ఢీ కొట్టింది ఎరుపు కలర్ కారు. వేగంగా వ‌చ్చి, ఢీ కొట్టింద‌ట‌. అయితే కింద‌ప‌డిన‌ ఆ బైకర్ వెంటనే లేచి, కారు ముందుకు వచ్చి ఆపే ప్రయత్నం చేశాడు.

బెంగ‌ళూరులో దారుణం..బైక‌ర్ ను ఢీ కొట్టి, 500 మీట‌ర్ల వ‌ర‌కు గాల్లోనే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కట్టిన రూల్స్ అమలు చేసినప్పటికీ.. ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతోంది. దీనివల్ల అమాయకులు మరణిస్తున్నారు. అయితే తాజాగా ఒక కారు డ్రైవర్ చేసిన అరాచకం... ఓ వ్యక్తి ప్రాణాలను తీసేది. కానీ ఓ ఆటో డ్రైవర్ సమయ స్ఫూర్తితో పెను ప్రమాదం జరగలేదు. దీంతో ఈ సంఘ‌ట‌న ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరులో త‌ప్పిన పెను ప్రమాదం

బెంగళూరులో ఉన్న ఓ కాలనీలో బైకర్ ను ఢీ కొట్టింది ఎరుపు కలర్ కారు. వేగంగా వ‌చ్చి, ఢీ కొట్టింద‌ట‌. అయితే కింద‌ప‌డిన‌ ఆ బైకర్ వెంటనే లేచి, కారు ముందుకు వచ్చి ఆపే ప్రయత్నం చేశాడు. అయితే నష్ట పరిహారం కట్టాల్సి వస్తుందన్న భయంతో కారు డ్రైవర్ వేగంగా ముందుకు వెళ్లాడు. దాంతో ముందు ఉన్న బాధితుడు కారు బోనెట్ పై వేలాడాడు. అలా బోనెట్ పై వేలాడుతూ దాదాపు 500 మీటర్ల వరకు వెళ్లాడు.

ఈ త‌రుణంలోనే ఆపు ఆపు అంటూ ఆ బైకర్ ఎంత బతిలాడినా కూడా ఆగలేదు. కానీ అదే దారిలో ఉన్న ఓ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. తన ఆటోను అడ్డుగా పెట్టి కారణం బ్లాక్ చేశాడు. దీంతో బోనెట్ పై ఉన్న వ్యక్తి ప్రాణాలతో బయటపడిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అటు కారు డ్రైవర్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మర్డర్ అటెంప్ట్ కింద ఆ కారు డ్రైవర్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, జైలుకు పంపారు. ఇక ఈ సంఘ‌ట‌న వీడియో వైర‌ల్ కావ‌డంతో, జ‌నాలు రియాక్ట్ అవుతున్నారు. ఆ కారు డ్రైవ‌ర్ ను ఉరి తీయాల‌ని అంటున్నారు.

Next Story