- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉడకబెట్టడానికే కాదు.. గుడ్డు పెంకు తీయడానికి కూడా మెషిన్ వచ్చేసింది
కోడిగుడ్డు ఉడకబెట్టిన తర్వాత.. దాని పెంకు తీసే మెషిన్ కూడా వచ్చేసింది

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో.. రకరకాల వీడియోలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కోడిగుడ్డుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు కోడిగుడ్డు ఉడకబెట్టేందుకు చాలా మెషిన్స్ వచ్చాయి. రకరకాల పేర్లతో వాటిని తీసుకువచ్చారు. ప్రతి ఇంట్లో కోడిగుడ్డును ఉడకబెట్టే పరికరాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు కోడిగుడ్డు ఉడకబెట్టిన తర్వాత.. దాని పెంకు తీసే మెషిన్ కూడా వచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అచ్చం ఏసీ లాగానే ఈ మెషిన్ ఉంది. ఉడకబెట్టిన కోడిగుడ్లను.. ఈ మెషిన్ పైన ఉన్న బాక్స్ లో వేస్తే... పెంకు ఊడిపోయి.. ఉడకబెట్టిన గుడ్డు బయటకు వస్తోంది. ఆ తర్వాత దాన్ని కడుక్కొని నేరుగా తినడమే..!
దీనికి సంబంధించిన వీడియోను ఫోన్ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్.. రకరకాలుగా స్పందిస్తున్నారు. కోడిగుడ్డు ఉడకబెట్టే మెషిన్ చూసాం కానీ.. ఇలా పెంకు తీసే మెషిన్ కూడా రావడం గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోందని.. అందుకే ఇలాంటి మెషిన్స్ వస్తున్నాయని అంటున్నారు.
Instagramme Link






