ఆకాశం నుంచి మెరుపు దాడి.. ముక్కలైన శివలింగం.. దేవుడు ఆగ్రహించాడా?? (వీడియో)

by Sujitha Rachapalli |

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని రతన్‌పూర్‌లో ఉన్న రామేశ్వర్ మహాదేవ్ ఆలయంపై పిడుగు పడిందని.. శివలింగం ముక్కలైపోయిందన్న వార్త వైరల్ అయింది. ఆకాశం నుంచి శివలింగం మీద పడిన మెరుపు ధాటికి ఇలా జరిగిందని ఇంకొందరు ప్రచారం చేశారు

ఆకాశం నుంచి మెరుపు దాడి.. ముక్కలైన శివలింగం.. దేవుడు ఆగ్రహించాడా?? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని రతన్‌పూర్‌లో ఉన్న రామేశ్వర్ మహాదేవ్ ఆలయంపై పిడుగు పడిందని.. శివలింగం ముక్కలైపోయిందన్న వార్త వైరల్ అయింది. ఆకాశం నుంచి శివలింగం మీద పడిన మెరుపు ధాటికి ఇలా జరిగిందని ఇంకొందరు ప్రచారం చేశారు. ఇలాంటి సంఘటనలు కారణం లేకుండా జరగవని.. మహాదేవుడు మనకేదో సంకేతమిస్తున్నాడని చెప్తున్నారు. ధర్మాన్ని అవమానిస్తూ.. ప్రకృతిని నాశనం చేస్తూ.. అత్యాశలో మునిగిపోవడమే ఇందుకు కారణమా? అనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు భక్తులు మాత్రం దేవుడికి కోపం వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. ఏం జరుగబోతుందోనని భయపడుతున్నారు.

కానీ శివలింగం స్థిరంగా ఉందని నిర్ధారించాయి కొన్ని మీడియా సంస్థలు. స్థానికులు శివలింగం చెక్కు చెదరకుండా ఉండడాన్ని అద్భుతంగా భావిస్తున్నట్లు కథనాలను ప్రచురించాయి. శివలింగం విరిగిపోయిందనే వార్తలను నమ్మొద్దని సూచించాయి. ఇక ఈ సంఘటన చాలా సహజమైందని.. శివలింగం రాయితో చేయడం వల్ల దెబ్బతినకుండా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ఘటనను ఆధ్యాత్మికత, ధర్మంతో ముడిపెట్టొదని శాస్త్రీయ దృక్కోణంలో చూడాలని సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడానికి ఆలయాలలో పిడుగు సంరక్షణ వ్యవస్థలను (లైట్నింగ్ అరెస్టర్స్) ఏర్పాటు చేయాలంటున్నారు.

VIDEO

Next Story