- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్రో 'రీల్' డాన్స్ వైరల్...ఈ లేడీ అరాచకం చూస్తే
మెట్రో ట్రైన్ లో ఓ లేడీ డ్యాన్స్ ఇరగదీసింది. రీల్స్ కోసం ఈ డ్యాన్స్ చేసి, మెట్రోలో రచ్చ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో ఫన్నీ వీడియోలు కొన్ని ఉంటే.. మరికొన్ని చాలా భయంకరంగా ఉంటాయి. ఇక మరికొన్ని వీడియోలైతే చాలా వింతగా కూడా ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో రీల్స్ కోసం జనాలు రకరకాల సాహసాలను చేస్తున్నారు. అయితే తాజాగా ఓ లేడీ మెట్రో ట్రైన్ లో రీల్ చేసి వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెట్రో, దేవస్థానాలు, విమానాశ్రయాలు ఎలాంటి పబ్లిక్ ప్లేసులలో రీల్స్ చేయడం నేరం. అలా చేస్తే కచ్చితంగా పోలీస్ కేసు అవుతుంది. అయితే ఇవన్నీ పట్టనట్లుగా వ్యవహరించింది ఓ మహిళ.
దాదాపు 40 సంవత్సరాలు ఉన్న ఓ మహిళ ముంబైలోని మెట్రో ట్రైన్ లో డాన్స్ చేసింది. రీల్స్ చేసి పాపులర్ కావాలన్న కసితో ఆమె మెట్రో ట్రైన్ లో డాన్స్ చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ట్రైన్ లో ఉన్న ప్రయాణికులందరూ భయపడేలా, గట్టిగా అరుస్తూ రచ్చ చేసింది. ఇక ఆమె డాన్స్ చూసి ప్రయాణికులందరూ ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్, ఆమెపై సీరియస్ అవుతున్నారు. ఇలాంటి రీల్స్ ఇంట్లో చేసుకోవాలి.. పబ్లిక్ ప్లేసుల్లో చేస్తే జనాలు కొడతారంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ఈ సంఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్లిక్






