Video: అదృష్ట‌మంటే వీళ్ల‌దే, ఏకంగా 9 మంది బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డారు !

by velandi.Saikiran |

ఓ కారు బీభత్సం సృష్టించి, 9 మంది చావుకు కారణం అయ్యేది. కానీ అదృష్టం బాగుండి ఈ తొమ్మిది మంది బతికి బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Video: అదృష్ట‌మంటే వీళ్ల‌దే, ఏకంగా 9 మంది బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డారు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీస్ యంత్రాంగం అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రతినిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. అయినా కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ కారు బీభత్సం సృష్టించి, 9 మంది చావుకు కారణం అయ్యేది. కానీ అదృష్టం బాగుండి ఈ తొమ్మిది మంది బతికి బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

బెంగళూరులో షాకింగ్ ఘటన

బెంగళూరులోని ఇందిరానగర్ ప్రాంతంలో జనవరి 9వ తేదీన ఒక కారు బీభత్సం సృష్టించింది. గల్లీలో నుంచి వేగంగా వచ్చి, మెయిన్ రోడ్డు స‌మీపంలో ఉన్న‌ గోడను ఢీ కొట్టింది. అయితే ఆ కారు రాకముందు, రోడ్డుపైన నిలబడి సరదాగా మాట్లాడుకుంటున్నారు కొంత మంది. ఇక క్షణాల్లోనే ఓ గల్లి నుంచి వేగంగా కారు దూసుకు వచ్చింది. అయితే ఆ కారు రావడాన్ని గ‌మ‌నించిన జనాలు, అలర్ట్ అయి తప్పించుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అటు ఇద్దరు బైకర్లు, ఓ ఆటో డ్రైవర్ కూడా తప్పించుకున్నాడు. ఇలా మొత్తం 9 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో చూస్తే అర్థమవుతుంది. అటు కారు నడిపిన డ్రైవర్ కు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story