- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Girl Monalisa : మోనాలిసాకు భారీ షాక్
ఉత్తరప్రదేశ్(UP) లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళా(PrajayRaj Kumbhamela)లో పూసలమ్ముకునే యువతి మోనాలిసా(Monalisa) పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్(UP) లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళా(PrajayRaj Kumbhamela)లో పూసలమ్ముకునే యువతి మోనాలిసా(Monalisa) పాపులర్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఇంటర్వ్యూలు తీసుకోవడంతో పాటు.. పలు షాప్స్ ఓపెనింగ్స్ కు హాజరైంది. అయితే ఆమెతో సినిమా తీసేందుకు కూడా ఓ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధమవడం సంచలనం రేపింది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా(Director Sanoj Mishra) తాను తీసే 'ది డైరీ ఆఫ్ మణిపూర్'(The Dairy Of Manipur)లో మోనాలిసాకు కీలక పాత్ర ఇస్తానని ప్రకటించారు. దీంతో ఇక మోనాలిసాకు మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చి పడతాయని అంతా భావించారు. కాని తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడని అన్నట్టు.. ఇప్పుడు మోనాలిసాకు వచ్చిన అవకాశం కాస్త జారిపోయినట్టే అంటున్నారు.
దానికి కారణం డైరెక్టర్ సనోజ్ లైంగిక దాడి ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇంక మోనాలిసా సినిమా అటకెక్కినట్టే అని అంతా భావిస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయ్యో పాపం అని కొందరు అంటుంటే.., సినిమా అంటే ఉత్తమాటలు కాదని మరికొందరు అంటున్నారు. ఇంకా కొంతమంది మాత్రం మోనాలిసా మళ్ళీ పూసలు అమ్ముకోవాల్సిందేనని పోస్టులు కామెంట్లు పెడుతున్నారు.






