కష్టపడి కొన్నా తినాల్సిందే.. కుకింగ్ రియాలిటీ షోలో జడ్జిలకు వింత అనుభవం

by Dishafeatures2 |
కష్టపడి కొన్నా తినాల్సిందే.. కుకింగ్ రియాలిటీ షోలో జడ్జిలకు వింత అనుభవం
X

దిశ, వెబ్ డెస్క్: అదో పెద్ద కుకింగ్ రియాలిటీ షో. వంటల్లో తమ ప్రతిభను కనబర్చడానికి చాలా మంది యువతులు ఆ షోలో పాల్గొన్నారు. అయితే ఆ షోలో పాల్గొన్న ఓ యువతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. అయితే అందుకు కారణం ఆమె ఏదో టేస్టీ ఫుడ్ తయారు చేసింది అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అసలు ఏం జరిగిందంటే..?

‘ది కిచెన్ మాస్టర్’ అనే కుకింగ్ రియాలిటీ షో పాకిస్తాన్ లో బాగా పాపులర్. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ రకరకాల వంటకాలు చేస్తూ తమ కుకింగ్ ప్రతిభను నిరూపించుకుంటుంటారు. బెస్ట్ వంటకాలను డిసైడ్ చేసేందుకు జడ్జిలు కూడా ఉంటారు. తాజాగా ఈ షో ఆడిషన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ షోకు ఓ యువతి బిర్యానీ ప్యాకెట్ తో వచ్చింది. బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేయడంతో వాసన ఘుమఘుమలాడుతోంది. చాలా బాగా వాసన వస్తోంది.. ఎలా చేశావంటూ ఆ జడ్జిలు ఆ యువతిని అడిగారు. దానికి ఆ యువతి బదులిస్తూ ‘ఈ బిర్యానీ నేను వండలేదు. మా ఏరియాలోని ఓ హోటల్ నుంచి తెచ్చాను’ అంటూ బాంబ్ పేల్చింది.

యువతి సమాధానం విన్న జడ్జిలు షాక్ తిన్నారు. ఇది ఈ షోకు విరుద్ధం.. అలా ఎలా చేస్తావంటూ ఆ యువతి దుమ్ము దులిపారు. ఆమెను ఆ షో నుంచి డిస్ క్వాలిఫై చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని గద్దించారు. కానీ ఇవేమీ పట్టించుకోని ఆ యువతి.. ‘గంటల కొద్దీ లైన్ లో నిలబడి బిర్యానీ కొన్నాను. మీరు తింటే గానీ ఇక్కడి నుంచి కదలను’’ అంటూ జడ్జిలకు తెగేసి చెప్పింది. దీంతో ఏం చేయాలో పాలుపోనీ జడ్జిలు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఈ షో ఏదో బాగుందే.. ఇక నుంచి ఈ షోను రెగులర్ గా ఫాల్ కావాలి అని ఒకరు అంటే.. ఈ ఘటనకు సంబంధించి ఓ యాడ్ స్పూఫ్ చేస్తే స్విగ్గీకి బాగా లాభాలు వస్తాయి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. చాలా ఫన్నీగా ఉంది.. ఐ లవ్ ఇట్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed