- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓవర్ యాక్టింగ్‌కు తగిన శిక్ష.. అయ్యో అనే వారే ఉండరేమో! (వీడియో)
హిందువులు జరుపుకునే పండుగల్లో దీపావళి(Diwali Festival)కి చాలా ప్రత్యేకత ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: హిందువులు జరుపుకునే పండుగల్లో దీపావళి(Diwali Festival)కి చాలా ప్రత్యేకత ఉంటుంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతియేటా అమావాస్య రోజున వస్తుంది. దీపాలతో మొత్తం ఇంటికి అందంగా తీర్చిదిద్దుకుంటారు. కొత్త బట్టలు, పిండి వంటలతో అంతా సందడి సందడిగా ఉంటుంది. అయితే.. దీపావళి వేడుకలను బాణసంచా కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. చిన్నా పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ క్రాకర్స్ కాలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు.
అయితే ఈ బాణాసంచా కాల్చే సమయంలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. చేతుల్లో పట్టుకుని కాల్చడం, ఏదైనా వస్తువుల కింద పెట్టి కాల్చడం, నడిరోడ్డుపై వాహనాలకు అంతరాయం కలిగించేలా కాలుస్తూ అతి ఉత్సాహం చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన దీపావళి రోజునే జరిగినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి క్రాకర్‌ను నోట్లో పెట్టుకుని నిప్పు అంటించుకున్నారు. అది కాస్త మొత్తం మొఖంపై కాలి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ‘ఓవర్ యాక్టింగ్‌కు తగిన శిక్ష.. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇలాగే జరుగుతుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు. వీడియో






