సెలవు అడిగితే ఇలా కూడా అంటారా?.. మేనేజర్ చెప్పిన మాటలకు మహిళా ఉద్యోగి షాక్‌!

by Jakkula.Mamatha |

పని ఒత్తిడి పేరుతో కొందరు మేనేజర్లు ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తారో తెలిపే ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.

సెలవు అడిగితే ఇలా కూడా అంటారా?.. మేనేజర్ చెప్పిన మాటలకు మహిళా ఉద్యోగి షాక్‌!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏదైనా సంస్థలో ఉద్యోగం చేస్తున్నప్పుడు లీవ్ అడగడం కామాన్. హెల్త్ బాగా లేకపోయినా, ఫంక్షన్స్‌కి హాజరవ్వాల్సిన టైంలోనూ లీవ్స్ అడుగుతుంటారు. ఇక, అత్యవసర పనులు ఉన్నప్పుడు సడన్ లీవ్ కూడా అడుగుతుంటారు. కొన్ని సార్లు లీవ్ అడిగితే మేనేజర్ ఆగ్రహనికి గురవుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో లీవ్ అడిగిన ఉద్యోగులకు మేనేజర్ వింత సలహాలు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది.

పని ఒత్తిడి పేరుతో కొందరు మేనేజర్లు ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తారో తెలిపే ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో పనిచేస్తున్న మహిళ ఉద్యోగికి షాకింగ్ ఘటన ఎదురైంది. తమ తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని తనని చూసుకోవడానికి బ్యాంకు మహిళా ఉద్యోగి సెలవు అడిగింది. లీవ్ ఇవ్వడానికి ఆ బ్యాంక్ మేనేజర్ నిరాకరించాడు. అంతటితో ఆగకుండా ఆమెకు మేనేజర్ వింత సలహా ఇచ్చాడు. ‘‘తల్లి కోలుకోకపోతే షెల్టర్ హోమ్ లో చేర్పించి ఉద్యోగానికి రా’’ అని ఆదేశించాడు. ఆ మాటలకు విస్తుపోయిన ఆమె, తల్లిని దూరం చేసుకోవడం ఇష్టం లేక తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో.. నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Next Story