- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెడ్డి జారిపోతున్న ఆటను కొనసాగించిన బుడ్డోడు.. మొత్తానికి స్కిప్పింగ్‌లో మెడల్ కొట్టేశాడు.. (వీడియో)
సాధారణంగా పిల్లలు ఎలా ఉంటారు.. కొంచెం ఇబ్బంది పడినా ఏడ్చేస్తారు. నలుగురిలో కొంచెం అవమానకరంగా అనిపించినా అక్కడి నుంచి పరుగెడుతారు. కానీ ఈ బుడ్డోడు మాత్రం చెడ్డి జారిపోతున్నా ఆటను కొనసాగించాడు. మెడల్ కొట్టేశాడు.

దిశ, ఫీచర్స్ : సాధారణంగా పిల్లలు ఎలా ఉంటారు.. కొంచెం ఇబ్బంది పడినా ఏడ్చేస్తారు. నలుగురిలో కొంచెం అవమానకరంగా అనిపించినా అక్కడి నుంచి పరుగెడుతారు. కానీ ఈ బుడ్డోడు మాత్రం చెడ్డి జారిపోతున్నా ఆటను కొనసాగించాడు. మెడల్ కొట్టేశాడు. ఈస్ట్ చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్‌లో జరిగిన పోటీల్లో ఆరేళ్ల బాలుడు స్కిప్పింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో లూజ్‌గా ఉన్న అతని డ్రెస్ ఇబ్బంది పెట్టింది. ఆడుతుంటే కిందకు వచ్చేసింది. కానీ మెడల్ కొట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్న చిన్నోడు.. ఈ ప్రాబ్లమ్‌ను లైట్ తీసుకున్నాడు. గేమ్ కంటిన్యూ చేశాడు. కాంపిటీషన్‌లో రన్నరప్‌గా నిలిచి మెడల్ అందుకున్నాడు.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బుడ్డోడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గివ్ అప్ చేయకూడదనే లెస్సన్ ఈ పిల్లాడి నుంచి నేర్చుకోవచ్చని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి హార్డ్ వర్క్, ఐక్యూ తమకు ఉండాలని.. ఇతరులు చెప్పే చెత్త మాటలు నమ్మకుండా మనపై మనం నమ్మకంతో ఉండాలని అంటున్నారు. చెడ్డి జారిపోతే ఏంటి.. భూకంపం వస్తే ఏంటి.. నాకు మెడల్ కావాలి.. అంతే.. అన్నట్లుగా ఆడాడని.. ఫిదా అయిపోయామని చెప్తున్నారు.






