- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిన్నర్ డేట్‌కి వెళ్లిన జంట.. కట్ చేస్తే.. ఏకంగా రూ.12.8 కోట్లతో తిరిగొచ్చారు!
సాయంత్రం వేళ సరదాగా గడపాలని డిన్నర్ డేట్‌కి వెళ్లిన ఓ జంటకు అదృష్టం మాములుగా వరించలేదు, ఏకంగా కోటీశ్వరులనే చేసింది.

దిశ, వెబ్ డెస్క్: సాయంత్రం వేళ సరదాగా గడపాలని డిన్నర్ డేట్‌కి వెళ్లిన ఓ జంటకు అదృష్టం మాములుగా వరించలేదు, ఏకంగా కోటీశ్వరులనే చేసింది. కేవలం రూ.257తో కొనుగోలు చేసిన లాటరీ టికెట్ ఒక్కసారిగా వారి జీవితాన్ని మార్చేసింది. అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్న ఓ జంట డిన్నర్‌కి వెళ్తుండగా.. న్యూట్లీ పట్టణంలోని లక్కీ డేలీ 397 సెంటర్ స్ట్రీట్ వద్ద 3 డాలర్లు వెచ్చించి ఓ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. అనంతరం ఆ లాటరీ టికెట్‌ను స్క్రాచ్ చేసి చూడగా.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అస్సలు ఊహించని విధంగా 1.5 మిలియన్ డాలర్లను గెలుపొందారు.
నిజానికి ఆ లాటరీ టికెట్ కొనుగోలు విషయంలో ఆ జంట మధ్య చిన్నపాటి వాదనే జరిగింది. వేరే చోట కొనుగోలు చేద్దామని ఒకరు.. ఇక్కడే కొనుగోలు చేయాలని మరొకరు ఇలా కాసేపు వాదన అనంతరం 10 డాలర్లతో టికెట్‌తో పాటు రెండు 3 డాలర్ల టికెట్లను కొనుగోలు చేశారు. మొదటి టికెట్‌ను స్క్రాచ్ చేయగానే వారు ఆశ్చర్యంతో కూడిన ఆనందంలో మునిగిపోయారు. ఈ జంట $ 875,200 గెలుపొందగా.. ఈ గేమ్‌లో టాప్-3 లాటరీ ప్రైజ్ మనీ గెలుపొందటంతో లంప్ సం (ఒకే విడత) మొత్తాన్ని తీసుకోకుండా, వార్షికంగా చెల్లింపులు పొందే అన్యుటీ ఎంపిక (Annuity Payment) పథకాన్ని ఎంచుకున్నారు. దీని ప్రకారం వారు 25 సంవత్సరాల పాటు ఏడాదికి ఒకసారి చెల్లింపులు అందుకుంటారు. అంటే 25 ఏళ్లు పూర్తయ్యే సరికి $1.5 మిలియన్లు అందుకుంటారు.
1970లో స్థాపితమైన న్యూజెర్సీ లాటరీ ఇప్పటివరకు రాష్ట్రానికి సుమారు $33.7 బిలియన్ (రూ. 2.8 లక్షల కోట్లు) ఆదాయం తీసుకువచ్చింది. ప్రస్తుతం లాటరీ ద్వారా వచ్చే లాభాలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌కు వనరుగా ఉపయోగిస్తున్నారు. ఇది 2017లో కుదుర్చుకున్న 30 ఏళ్ల ఒప్పందానికి అనుగుణంగా అమలవుతోంది.






