- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కోరిక తీర్చుకోవడానికి భారీ స్కెచ్..! ఒకరు కాదు.. ఇద్దరు కాదు, ఏకంగా 20 మంది బాయ్ ఫ్రెండ్స్‌తో..!!
ఆ కోరిక తీర్చుకోవడానికి భారీ స్కెచ్..! ఒకరు కాదు.. ఇద్దరు కాదు, ఏకంగా 20 మంది బాయ్ ఫ్రెండ్స్‌తో..!!

దిశ, ఫీచర్స్ : అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు వినడానికి వింతగా అనిపిస్తుంటాయి. ఎలా వచ్చిందిరా బాబు ఈ ఐడియా అనేలా ఆశ్చర్య పరుస్తుంటాయి. అచ్చం అలాంటి న్యూస్ ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. చైనాకు చెందిన ఒక మహిళ ఒకరి తెలియకుండా ఒకరిని మొత్తం 20 మంది బాయ్ ఫ్రెండ్స్‌ను మెయింటైన్ చేస్తోంది. అయితే ఇటీవల ఆమెకు తనకంటూ ఒక సొంత ఇల్లు కనుక్కోవాలనే ఆలోచన కలిగింది. కానీ అందకు సరిపడా డబ్బులు మాత్రం లేవు. దీంతో ఒక అదిరిపోయే ప్లాన్ వేసి అమలు చేయగా, ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతోపాటు ఆమె తీవ్ర విమర్శలు సైతం ఎదుర్కొంటోంది.
ఇంతకీ ఆ చైనీస్ మహిళ ఏం చేసిందంటే తన 20 మంది బాయ్ ఫ్రెండ్స్(20 boyfriends)తో ఒకరికి తెలియకుండా ఒకరితో మాట్లాడి ప్రతీ ఒక్కరి ద్వారా ఒక ఐఫోన్ 7 (iPhone 7) కొనిపించింది. ఆ తర్వాత ఆ మొత్తం ఫోన్లను తాను తీసుకొని రీసైక్లింగ్ కంపెనీకి విక్రయించి దాదాపు రూ. 14 లక్షలు( $17,700 ) సంపాదించింది. మొత్తం ఫోన్లు అమ్మగా వచ్చిన ఈ డబ్బుతో ఆమె తాను కొత్తగా కొనాల్సిన ఇంటికోసం డౌన్ పేమెంట్ చెల్లించింది. ప్రజెంట్ ఈ న్యూస్ ‘#20 phones for a house’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, లక్షల కొద్దీ కామెంట్లు వస్తున్నాయి. కొందరు ఆమె వేసిన ప్లాన్‌ను తెలివైన చర్యగా అభివర్ణిస్తుంటే, మరికొందరు ఇలా మోసం చేయడం తగదంటూ తిట్టిపోస్తున్నారు. మరికొందరు ఇది నిజమో లేక సోషల్ మీడియాలో సంచలనం కోసం క్రియేట్ చేసిన ఫేక్ న్యూసో అని కూడా కామెంట్లు పెడుతున్నారు.






