- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారులోంచి జారిపడిన చిన్నారి.. ఆ తర్వాత షాకింగ్? సీసీటీవీ దృశ్యాలు వైరల్
చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి.

దిశ, వెబ్ డెస్క్: చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వారి భద్రతపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే, రెప్పపాటు క్షణం కూడా వారికి ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఒక చిన్న నిర్లక్ష్యమే పిల్లలకు పెను ముప్పుగా మారవచ్చు. ఇటీవల ఓ ఫ్యూయల్ స్టేషన్‌లో జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అసలేం జరిగిందంటే?
ఒక కారులో ప్రయాణిస్తున్న కుటుంబం పెట్రోల్ బంక్‌లో ఇంధనం నింపుకోవడానికి వచ్చింది. ఇంధనం నింపుకుంటుండగా కారులో వెనుక సీట్లో కూర్చున్న రెండు సంవత్సరాల చిన్నారి విండో నుంచి బయటకు జారింది. అనంతరం ఆ చిన్నారి అయోమయంగా కాసేపు అక్కడే నిలబడి ఉంది. ఇంతలో ఇంధనం నింపటం పూర్తవ్వటంతో డ్రైవర్ చిన్నారిని గమనించకుండా అక్కడే వదిలేసి కారు తీసుకుని వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు మొత్తం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. చిన్నారి ఒంటరిగా బంక్ చుట్టూ నడుచుకుంటూ తన తల్లిదండ్రులను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది? చిన్నారి తిరిగి తల్లిదండ్రులను కలిసిందా? ఎవరైనా సహాయం చేశారా? అనేది తెలియలేదు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది ఈ సంఘటన తెలియజేస్తుంది. ఒక్క క్షణం గమనించడం మానిపోతే ఎలాంటి ప్రమాదం జరగవచ్చో సూచిస్తుంది.






