వైర‌ల్ వ‌య్యారి పాట‌కి డ్యాన్స్ ఇరగదీసిన చిన్నారి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-24 11:58:00  IST  )

ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి (Kireeti reddy) హీరోగా పరిచయమైన సినిమా 'జూనియర్'.

వైర‌ల్ వ‌య్యారి పాట‌కి డ్యాన్స్ ఇరగదీసిన చిన్నారి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి (Kireeti reddy) హీరోగా పరిచయమైన సినిమా 'జూనియర్'. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ జూలై 18 తెలుగు, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. మంచి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా సందడి చేస్తోంది. ఇక ఈ సినిమాలోని ‘వైరల్ వయ్యారి’ పాటకు యువతలో విపరీతమైన స్పందన లభిస్తోంది. శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్, కిరీటి స్టెప్పులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ పాటకు సంబంధించిన వీడియోలు, రీల్స్, షార్ట్‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో రచ్చచేస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా కర్ణాటక రాష్ట్రం బళారికి చెందిన పూజ అనే స్కూల్ విద్యార్థిని ఈ పాటకు డ్యాన్స్ ఇరదీసింది. ఫుల్ ఎనర్జిటిక్‌గా అదిరిపోయే స్టెప్పులేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరో విషయం ఏంటంటే.. ఈ చిన్నారి స్వయంగా సినిమా హీరో కిరీటి రెడ్డి సమక్షంలోనే ఈ పాటకు డ్యాన్స్ చేసింది. ఇక తన డ్యాన్స్ చూసి ఆకర్షితులైన కిరీటి, తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ చిన్నారిని మెచ్చుకున్నారు. అంతేకాదు, ఆమెకు ఒక చిన్న కానుక కూడా అందించారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

Next Story