- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిర్యానీలో కాల్చేసిన బీడీ ప్రత్యక్షం.. దిమ్మతిరిగి కస్టమర్ మైండ్ బ్లాంక్
జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ హోటల్‌లో వడ్డించిన చికెన్ బిర్యానీలో కాల్చేసిన బీడీ ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో విచ్చలవిడిగా రెస్టారెంట్లు, హోటళ్లు పుట్టుకొస్తుండటంతో ఆహార భద్రత (Food Safety) ప్రశ్నార్థకంగా మారుతోంది. కస్టమర్లకు రోజుకో చేదు అనుభవాలు ఎదురవుతన్నాయి. తాజాగా, జూబ్లీహిల్స్ (Jubilee Hills)లోని ఓ రెస్టారెంట్‌లో వడ్డించిన బిర్యానీలో ఏకంగా కాల్చేసిన బీడీ ప్రత్యక్షం కావడంతో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి సమీపంలో ఉన్న ‘హన్వీన్ కేరళ కేఫ్’ (Hanwin Kerala Cafe)కు ఓ కస్టమర్ వెళ్లారు. అక్కడ ఆయన చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. సర్వర్ తెచ్చిచ్చిన బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటున్న క్రమంలో ఒక ముక్క కొంచెం వింతగా అనిపించింది. తీరా ప్లేటులో పక్కకు తీసి పరిశీలించగా అది చికెన్ ముక్క కాదని.. సగం కాల్చేసి ఉన్న బీడీ అని తేలింది.
నివ్వెరపోయిన కస్టమర్..
బిర్యానీలో బీడీని చూసిన సదరు కస్టమర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే హోటల్ సిబ్బందిని పిలిచి నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెబుతూ నిర్లక్ష్యంగా సమాధాం చెప్పారని బాధితుడు వాపోయాడు. వంటగదిలో పని చేసే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగి ఉంటుందని అతడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, బిర్యానీ ప్లేటులో బీడీ ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ చిత్రం చూసిన నెటిజన్లు ‘నగరంలోని ప్రముఖ హోటళ్లలోనే పరిస్థితి ఇలా ఉంటే, సామాన్యుల ఆరోగ్యం ఎవరికి భరోసా?’అని కామెంట్ చేస్తున్నారు.






