Video: కరీంనగర్‌లో అద్భుతం.. జాతీయ పతాకంతో ఆకాశంలో విహరించిన పక్షి

by Gantepaka Srikanth |

కరీంనగర్‌లో వింత చోటుచేసుకుంది.

Video: కరీంనగర్‌లో అద్భుతం.. జాతీయ పతాకంతో ఆకాశంలో విహరించిన పక్షి
X

దిశ, బ్యూరో కరీంనగర్: కరీంనగర్‌లో వింత చోటుచేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా అమర్చిన జాతీయ జెండాను పట్టుకుని ఓ పక్షి ఆకాశంలో విహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. కరీంనగర్‌లోని మానేరు డ్యాం గేట్ల పైనుండి పక్షి విహరించడంతో ఆ సన్నివేశాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వింతను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నచ్చిన వాళ్లు షేర్ చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు.

Next Story