ఈ బుడ్డోడి తెలివికి ఫిదా అయిపోవాల్సిందే.. ఇంత చిన్న వయసులోనే !

by velandi.Saikiran |

చిన్నపిల్లలు... చేసే చేష్టలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. కళ్ళముందే... చిన్నచిన్న అడుగులు వేస్తూ... చిలిపి పనులు చాలా

ఈ బుడ్డోడి తెలివికి ఫిదా అయిపోవాల్సిందే.. ఇంత చిన్న వయసులోనే !
X

దిశ, వెబ్ డెస్క్: చిన్నపిల్లలు... చేసే చేష్టలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. కళ్ళముందే... చిన్నచిన్న అడుగులు వేస్తూ... చిలిపి పనులు చాలా చేస్తూ ఉంటారు పిల్లలు. ఇందులో కాస్త అల్లరి చేసే పిల్లలు ఉంటే... కొంతమంది సైలెంట్ గా అన్ని కానిచ్చేస్తారు. అయితే తాజాగా ఓ కుర్రాడు.. చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కుర్రాడి వయసు 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ... అందరూ అతడి టాలెంట్ కు ఫిదా అయిపోతున్నారు.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... ఓ మారుమూల గ్రామంలో... నీటి కరువు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఓ ఐదేళ్ల చిన్నపిల్లడికి కాస్త దాహం వేసింది. అక్కడే చేతితో కొట్టే బోరింగ్... కనిపించింది. దీంతో ఒక్క పెద్ద గ్లాస్ తీసుకొని.... ఆ బోరింగ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ నీళ్ల బోరింగ్ కొట్టేందుకు... మొదట ఇబ్బందిపడ్డాడు. కానీ ఆ తర్వాత తన తెలివి ఉపయోగించాడు.

వాటర్ పడే దగ్గర గ్లాస్ పెట్టి ... చేతితో పంపు చేశాడు. మొదట అది సాధ్యం కాకపోవడంతో... చేతితో కొట్టే ఐరన్ రాడ్ పైకి ఎక్కాడు. దీంతో అతని బరువుకు... ఆ ఐరన్ రాడ్ కిందికి వెళ్లడం మొదలుపెట్టింది. దీంతో గ్లాసులో వాటర్ పడ్డాయి. అలా పలుమార్లు చేసి... తన దాహం తీర్చుకున్నాడు కుర్రాడు. దీనికి సంబంధించిన విజువల్స్ మనం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆ కుర్రాడిది మామూలు తెలివి కాదు.. చాలా టాలెంటెడ్ ఉన్నాడని కామెంట్స్ పెడుతున్నారు.

instagramme link

Next Story