Love and Affair : లవర్ కోరిక తీర్చడానికి పేరెంట్స్‌నే మోసం చేసిన యువతి.. చివరికి ఏం చేశాడంటే..!

by Javid Pasha |   (  Updated:2025-06-26 06:17:08  IST  )

Love and Affair : లవర్ కోరిక తీర్చడానికి పేరెంట్స్‌నే మోసం చేసిన యువతి.. చివరికి ఏం చేశాడంటే..!

Love and Affair : లవర్ కోరిక తీర్చడానికి పేరెంట్స్‌నే మోసం చేసిన యువతి.. చివరికి ఏం చేశాడంటే..!
X

దిశ, ఫీచర్స్ : ప్రేమించిన వ్యక్తిని మోసం చేయడం, లవ్ అండ్ ఎఫైర్‌తో మోస పోవడం వంటి సంఘటనలు ఈ మధ్య చాలా కామన్ అయిపోయాయి. అందుకు సంబంధించిన వార్తలు తరచుగా వైరల్‌గా మారుతున్నాయి. ప్రేమ, పెళ్లి, మోసం వంటి అంశాలు, సంఘటనలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. రీసెంట్‌గా అలాంటి ఆసక్తి రేకెత్తించే సంఘటనే మరొకటి జరిగింది. కారు తన ప్రియుడి కోరికను తీర్చేందుకు ఓ యువతి తల్లిదండ్రులనే మోసం చేసింది. రూ. 20 లక్షలు దొంగిలి అతనికిస్తే చివరికి ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

వైరల్ సమాచారం ప్రకారం.. చెన్నైకు చెందిన 21 ఏండ్ల కాలేజ్ స్టూడెంట్ తన క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ఇటీవల ఆమె ప్రియుడు తనకు కారు కొనాలని ఉందంటూ సదరు యువతితో చెప్పాడు. కానీ అంత డబ్బు తనవద్ద లేదు కాబట్టి ఆ కల ఎన్నటికీ నెరవేరదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది విన్న ప్రియురాలు ఎలాగైనా తన లవర్ కోరిక నెరవేర్చాలని డిసైడ్ అయింది. అందుకోసం ఆమె తన తల్లిదండ్రులకు తెలియకుండానే, వారు దాచుకున్న రూ. 20 లక్షలు దొంగిలించి ప్రియుడికి ఇచ్చింది. పేరెంట్స్ అకౌంట్లో నుంచి కూడా రహస్యంగా డబ్బులు డ్రా చేసి ఇచ్చింది. ఇంత చేసినా ఆమెకు ఊహించని షాక్ ఎదురైంది. ఏంటంటే.. డబ్బులు తీసుకున్నాక ప్రియుడు మొహం చాటేశాడు. చివరికి మోసపోయినట్లు గ్రహించిన ఆమె చెన్నై పోలీసుకులు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తులో ఉంది. కాగా ఈ సంఘటన యువతలో మోసపూరిత ప్రేమ, ఎమోషనల్ మానిపులేషన్ (emotional manipulation), ఆర్థిక విషయాలపట్ల అవగాహన లోపం వంటి విషయాలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

Next Story