Viral:నేతాజీ ఆకారంలో రూట్ మ్యాప్.. 913 Km సైకిల్ తొక్కి..!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-24 09:10:17  IST  )

సుభాష్ చంద్రబోస్(Subhash Chandra Bose) జయంతి సందర్భంగా జనవరి(23)న దేశవ్యాప్తంగా నివాళులర్పించారు.

Viral:నేతాజీ ఆకారంలో రూట్ మ్యాప్.. 913 Km సైకిల్ తొక్కి..!?
X

దిశ,వెబ్‌డెస్క్: సుభాష్ చంద్రబోస్(Subhash Chandra Bose) జయంతి సందర్భంగా జనవరి 23న దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. నేతాజీ జయంతిని పరాక్రమ్‌ దివస్‌‌గా(Parakram Divas) కూడా పిలుస్తారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా, దేశం మొత్తం ఆయనను గౌరవప్రదంగా స్మరించుకుంటుంది. ఇదిలా ఉంటే.. స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన ఓ సైక్లిస్ట్ వినూత్నంగా నివాళులర్పించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్(Retired Army jawan) అయిన సైక్లిస్ట్ అనిల్ కుమార్(Anil Kumar) నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆకారంలో రూట్ మ్యాప్ గీసుకొని నగరంలో 11 రోజుల పాటు 913 కిలో మీటర్లు తొక్కారు. నగరంలోని ఏఓసీ(AOC) సెంటర్‌లో ఆరంభించి ఫాక్స్ సాగర్ దగ్గర ముగించారు. తాను బోస్‌కు వీరాభిమాని కావడం వల్లే ఇలా చేసినట్లు అనిల్ తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Next Story