- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
89 ఏళ్ల వయసులో బామ్మ సాహసం..ఏకంగా 21వ అంతస్తు వరకు
27వ అంతస్తు నుంచి, హీరో రేంజ్ లో 21వ అంతస్తు వరకు దిగేసింది ఆ 89 సంవత్సరాల బామ్మ.

దిశ, వెబ్ డెస్క్: 89 ఏళ్ల వయసులో ఓ బామ్మ ( Old Woman) చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనా రాజధాని బీజింగ్ లో 89 సంవత్సరాల బామ్మ, అందరికీ షాక్ ఇచ్చి 21 అంతస్తు వరకు కిటికీ ద్వారా దిగేసింది. వీడియోలో కనిపిస్తున్న ఈ బామ్మ 27వ అంతస్తులో ( Apartment) ఒంటరిగానే జీవనం కొనసాగిస్తోంది. అయితే లోపలి నుంచి డోర్ వేసుకొని తాళం ఎక్కడో పోగొట్టుకుంది. ఫోన్ మరో రూంలో ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే రూంలోనే లాక్ అయింది. దీంతో చేసేదేమీ లేక, కిటికీ ద్వారా ఇరవై ఏడో అంతస్తు నుంచి దిగడం మొదలు పెట్టింది.
27వ అంతస్తు నుంచి, హీరో రేంజ్ లో ఫీట్
మొండిగా వ్యవహరించి, సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నా కూడా వినలేదు. ఈ క్రమంలో 27వ అంతస్తు నుంచి, హీరో రేంజ్ లో 21వ అంతస్తు వరకు దిగేసింది ఆ 89 సంవత్సరాల బామ్మ. అయితే ఇంతలోనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి, ఆ భామ్మను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసినా నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. ఇంత మొండి పట్టుదల అవసరమా? కొంచెం స్లిప్ అయినా బామ్మ చనిపోయేది కదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ బామ్మ అంత పెద్ద సాహసం చేస్తుంటే స్థానికంగా ఉన్న జనాలు ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు.






