Viral news: పిల్లలకు ఫోన్ ఇస్తే ఇలాగే ఉంటుంది.. అమెజాన్‌లో లాలీపాప్స్ ఆర్డర్ చేసిన 8 ఏళ్ల బాలుడు.. బిల్లు చూసి షాకైన తల్లి!

by Yella Dhawani Reddy |

ప్రస్తుత రోజుల్లో పిల్లుల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు మాములు అయిపోయాయి.

Viral news: పిల్లలకు ఫోన్ ఇస్తే ఇలాగే ఉంటుంది.. అమెజాన్‌లో లాలీపాప్స్ ఆర్డర్ చేసిన 8 ఏళ్ల బాలుడు.. బిల్లు చూసి షాకైన తల్లి!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో పిల్లుల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు (Smart Phone) మాములు అయిపోయాయి. అయితే ఈ ఫోన్లతో పిల్లలు తెలిసి, తెలియక చేసే పనులే అప్పుడప్పుడు తల్లిదండ్రులకు తంటాలు తెచ్చిపెడుతుంటాయి. ఇలాంటి ఘటనలు గతంలోనే చాలానే చూశాం. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తే వైరల్‌గా మారింది. ఓ 8 ఏళ్ల పిల్లాడు అమెజాన్‌లో లాలీపాప్స్ ఆర్డర్ చేశాడు. అది చూసి పిల్లాడి తల్లి ఒక్కసారి షాక్‌కు గురైంది. లాలీపాప్స్ ఆర్డర్ చేస్తే షాకవ్వాల్సనంతా ఏముంది అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే.. ఆ పిల్లాడు ఆర్డర్ చేసిన లాలీపాప్స్ ఖరీదు రూ.3 లక్షలకే పైనే ఉంది. మీకూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా!

అమెరికాకు చెందిన హాలీ లాఫేవర్స్ అనే మహిళ ఇంటికి ఓ రోజు 70 వేల లాలీపాప్స్ అమెజాన్ నుంచి డెలివరీ అయ్యాయి. ఇది చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే.. వాటి మొత్తం విలువ 4200 డాలర్లు (భారత రూపాయలలో సుమారు రూ. 3.55 లక్షలు). అయితే, ఆ ఆర్డర్‌ను తన 8 ఏళ్ల పిల్లాడు లియామ్ చేసినట్లుగా గుర్తించింది. వెంటనే అమెజాన్‌ను సంప్రదించి, ఆర్డర్ క్యాన్సిల్ చేయమని కోరింది. అయితే, అందుకు అమెజాన్ తిరస్కరించింది.

దీంతో హాలీ సోషల్ మీడియాలో తన బాధను పంచుకుంది. తన 8 ఏళ్ల లియామ్ తన స్నేహితుల కోసం ఆర్డర్ చేశాడని, అయితే, చాలా ఎక్కువ మొత్తంలో ఆర్డర్ చేయటంతో ఏం చేయాలో తెలియటం లేదని పేర్కొంది. దీంతో పలువురు స్పందించి.. ఆమె వద్ద కొన్ని లాలీపాప్స్‌ను కొనుగోలు చేశారు. ఈ విషయం వైరల్ కావటంతో అమెజాన్ సైతం స్పందించి, మిగిలిన లాలీపాప్స్‌ను తిరిగి తీసుకునేందుకు అంగీకరించింది. అనంతరం లియామ్‌తో కలిసి కొన్ని లాలీపాప్స్‌ను వారు సమీపంలోని చర్చిల్లో, స్కూళ్లలో పంచిపెట్టారు. అయితే లియామ్ నిత్యం ఫోన్‌తో ఆడుకుంటాడని, కానీ ఈ విధంగా ఆర్డర్ చేయటం ఇదే మొదటిసారని హాలీ తెలిపింది. తనకు సాయం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపింది. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని చెప్పింది.





Next Story