- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే బైక్ కు 4 నెంబర్ ప్లేట్లు.. సరికొత్త ఫీచర్ వచ్చేసింది!
ఆ నెంబర్ ప్లేట్ ను ... స్మార్ట్ ఫోన్ ను స్క్రోలింగ్ చేసినట్లుగానే... చేసుకోవచ్చు. అలా చేస్తే మరో నెంబర్ ప్లేట్ వస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి రకరకాల వాహనాలు వస్తున్నాయి. టూ వీలర్ వెహికల్స్.. అతి తక్కువ ధరలో కూడా అందిస్తున్నాయి కంపెనీలు. మైలేజ్ ఎక్కువ ఉంటూ.. సామాన్యులకు అందుబాటు ధరలో టు వీలర్ వెహికల్స్ ను కంపెనీలు తీసుకువస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే... ఒకే బైక్ కు 4 నెంబర్ ప్లేట్లు ఉండేలా సరికొత్త బైక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మనం అనుకున్న నెంబర్ ప్లేట్ క్షణాల్లోనే మార్చుకునేలా.. ఈ బైక్ ను రూపొందించారు. హోండా కంపెనీ కి సంబంధించిన.. ఓ బైక్ ను అప్డేట్ చేశారు. అప్డేట్ చేసి వెనకాల డిజిటల్ నెంబర్ ప్లేట్ ను బిగించారు. అయితే ఆ నెంబర్ ప్లేట్ ను ... స్మార్ట్ ఫోన్ ను స్క్రోలింగ్ చేసినట్లుగానే... చేసుకోవచ్చు. అలా చేస్తే మరో నెంబర్ ప్లేట్ వస్తోంది.
అలా ఒకటి నుంచి నాలుగు నెంబర్ ప్లేట్ల వరకు పెట్టుకోవచ్చట. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే... ఈ వీడియో విదేశాలకు సంబంధించినదిగా తెలుస్తోంది. అయితే ఇలాంటి నెంబర్ ప్లేట్ వాడితే.. కచ్చితంగా బొక్కలో వేయడం గ్యారంటీ అని ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ అంటున్నారు.






