బాత్ రూంలో 16 అడుగుల గిరినాగు...బుసలు కొడుతూ

by velandi.Saikiran |

బాత్ రూంలో 16 అడుగుల గిరినాగు పార్వతీపురం మన్యం జిల్లా కిచ్చాడలో ఓ ఇంటి బాత్ రూంలో

బాత్ రూంలో 16 అడుగుల గిరినాగు...బుసలు కొడుతూ
X

దిశ, వెబ్ డెస్క్: వర్షాకాలం ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక వర్షాలు పడుతున్న నేపథ్యంలో రకరకాల క్రిమి కీటకాలు, పాములు ఇండ్లలోకి చొరబడుతున్నాయి. వరదతో పాటు ఈ పాములు.. ఇళ్లల్లోకి వెళ్లి జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఓ ఇంటి బాత్రూంలోకి కూడా గిరి నాగు (Snake ) ప్రవేశించింది. ఈ సంఘటన మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. మన్యం జిల్లాలో ఏకంగా 16 అడుగుల గిరి నాగు హల్చల్ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలో (Parvathipuram Manyam) ఇవాళ ఉదయం బాత్రూంకు వెళ్దామని ఇంటి యజమాని భార్య ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలోనే వాష్ రూమ్ లో 16 అడుగుల గిరి నాగు కనిపించింది. అనంతరం తన భర్తకు చెప్పడంతో.. అతను అలర్ట్ అయ్యాడు. అనంతరం స్నేక్ క్యాచర్స్ కు సమాధానం ఇచ్చాడు ఆ ఇంటి యజమాని. దీంతో ఇద్దరు యువకులు రంగంలోకి దిగారు. ఆ గిరినాగును.. చాకచక్యంతో పట్టుకొని అడవిలో వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. క్లిక్

Next Story