PrayagRaj Mahakumbhmela : మహాకుంభమేళాలో 12 మంది జననం.. వారి పేర్లు ఇవే

by M.Rajitha |
PrayagRaj Mahakumbhmela : మహాకుంభమేళాలో 12 మంది జననం.. వారి పేర్లు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్(UP) లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా(PrayagRaj Mahakumbhmela) ఘనంగా జరుగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా ప్రారంభం అయి గడిచిన 28 రోజుల కాలంలో దాదాపు 44 కోట్ల మంది ఈ ఉత్సవంలో పాల్గొన్నట్టు ఉత్తరప్రదేశ్(UP) ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ మహాకుంభమేళా ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు 12 మంది గర్భిణీలు డెలివరీ(Delivery) అయ్యారు. కాగా వీరివన్నీ సాధారణ కాన్పులే అవడం మరో విశేషం. వీరిలో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. పుట్టిన పిల్లల్లో ఆడపిల్లలకు బసంతి, గంగ, జమున, బసంత్ పంచమి, సరస్వతి అని పేర్లు పెట్టారు. అదే విధంగా మగ పిల్లలకు కుంభ్, భోలేనాథ్, బజ్ రంగీ, నంది వంటి పేర్లు పెట్టినట్టు ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రయాగ్ కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. అయితే ప్రయాగ్ రాజ్ కు భక్తులు విపరీతంగా పోటెత్తుతుండటంతో మహా కుంభమేళాకు చేరుకునే అన్ని వైపులా రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి. దాదాపు 300 కిమీల ట్రాఫిక్ జామ్ అయినట్టు ప్రయాగ్ రాజ్ అధికారులు తెలిపారు. 50 కిమీల ప్రయాణానికి 12 గంటల సమయం పడుతుండటం ప్రయాగ్ రాజ్ కు వచ్చే భక్తుల సంఖ్యకు అద్దం పడుతోంది. మరోవైపు ట్రాఫిక్ లో ఇరుక్కున్న యాత్రికులకు నీరు, ఆహారపదార్థాల పంపిణీ వంటి చర్యలు చేపట్టారు అధికారులు.

Advertisement
Next Story