- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎనిమిది మంది తహసీల్దార్ల బదిలీ
<p>దిశ, కరీంనగర్ సిటీ : ఐదవ జోన్ పరిధిలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఎనిమిది మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న ఎల్. రామ్ రెడ్డి, ఎస్. రాజులను కరీంనగర్ జిల్లాకు, కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న ఐ.భావ్ సింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు, కె.నారాయణ కరీంనగర్ జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లాకు, అక్కడ […]</p>

దిశ, కరీంనగర్ సిటీ : ఐదవ జోన్ పరిధిలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఎనిమిది మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న ఎల్. రామ్ రెడ్డి, ఎస్. రాజులను కరీంనగర్ జిల్లాకు, కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న ఐ.భావ్ సింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు, కె.నారాయణ కరీంనగర్ జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లాకు, అక్కడ ఎస్సీ కార్పొరేషన్ ఈడి గా విధులు నిర్వహిస్తున్న జి.సరితను కరీంనగర్ జిల్లాకు, కరీంనగర్‌లో ఇదే పోస్టులో కొనసాగుతున్న ఎస్. కనకయ్యను పెద్దపల్లి జిల్లాకు, అదే జిల్లాలో పనిచేస్తున్న ఎండి. జైద్ పాషాను వరంగల్ అర్బన్ జిల్లాకు, ఆ జిల్లాలో కొనసాగుతున్న ఎం. జ్యోతి వెంకట లక్ష్మీ దేవిని రాజన్న సిరిసిల్ల జిల్లాకు స్థానచలనం కల్పిస్తూ, ఆదేశాలు జారీ చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని సిఎస్ పేర్కొన్నారు.






