- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక : జుట్టు కావాలా..? ప్రాణం కావాలా..?
<p>దిశ, వెబ్‌డెస్క్ : వాహనం నడిపే సమయంలో యువత హెల్మెట్ ధరించేందుకు ఆసక్తి చూపడం లేదు. హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ లాస్ అవుతుందనే సమాధానం వస్తోంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్ అవుతుందనే ఉద్ధేశ్యంతో ఫైన్ కట్టాడానికైనా సిద్ధం అయ్యారు. ఇలాంటి వారి కోసమే హైదరాబాద్ సిటీ పోలీసులు అవగాహన కల్పించేలా ఓ ట్వీట్ చేశారు. హాస్యాస్పదంతో పాటు ఆలోచింపజేసేలా ఉండటంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకూ ఆ ట్వీట్‌లో ఏముందంటే.. ‘‘ఎవరైతే హెల్మెట్ వాడితే హెయిర్ లాస్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : వాహనం నడిపే సమయంలో యువత హెల్మెట్ ధరించేందుకు ఆసక్తి చూపడం లేదు. హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ లాస్ అవుతుందనే సమాధానం వస్తోంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్ అవుతుందనే ఉద్ధేశ్యంతో ఫైన్ కట్టాడానికైనా సిద్ధం అయ్యారు. ఇలాంటి వారి కోసమే హైదరాబాద్ సిటీ పోలీసులు అవగాహన కల్పించేలా ఓ ట్వీట్ చేశారు. హాస్యాస్పదంతో పాటు ఆలోచింపజేసేలా ఉండటంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకూ ఆ ట్వీట్‌లో ఏముందంటే.. ‘‘ఎవరైతే హెల్మెట్ వాడితే హెయిర్ లాస్ అవుతుందని అనుకుంటున్నారో వారి కోసమే ఇది. హెల్మెట్ వాడి జుట్టు లేకున్నా బతికి ఉంటారో… హెల్మెట్ వాడకుండా యాక్సిడెంట్‌లో చనిపోతారో మీరే నిర్ణయించుకోండి.’’ అని ఉంది.
Life will not be short, Please wear a Helmet live longer.#RoadSafety #wearhelmet pic.twitter.com/zQYQicYC7c
— Hyderabad Traffic Police (@HYDTP) August 30, 2021






