వైరల్ వీడియో: యువతిని ఆపిన ట్రాఫిక్ పోలీస్.. లంచంగా నడిరోడ్డుపై ముద్దుపెట్టి

by  |
వైరల్ వీడియో: యువతిని ఆపిన ట్రాఫిక్ పోలీస్.. లంచంగా నడిరోడ్డుపై ముద్దుపెట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్ ఉంటే అతనిని తప్పించుకొని ముందుకు వెళ్లడం కష్టమైన పనే.. ఇక పేపర్లు లేవని తెలిస్తే చలానా కట్టేవరకు వదిలేది లేదు. మరికొంతమంది లంచం లాంటిది తీసుకొని చూసీచూడనట్టు వదిలేస్తారు. అయితే ఈ వీడియోలో ఒక యువతి ట్రాఫిక్ పోలీస్ కి లంచమిస్తూ దొరికిపోయింది. అర్రే.. అదేమైనా పెద్ద విషయమా అంటే.. అవును పెద్ద విషయమే.. ఎందుకంటే ఆమె లంచంగా ఇచ్చింది డబ్బు కాదు.. ముద్దు. అందుకే ఈ వీడియో అంత వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఒక యువతి తప్పు చేయడంతో ట్రాఫిక్ పోలీసులు ఆమెని పట్టుకున్నారు. అయితే ఆమె ఎంత బతిమలాడిన అందులో ఒక ట్రాఫిక్ పోలీస్ ఆమె మాట వినలేదు. అతనికి లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నించింది. అందుకు కూడా ఆయన ససేమిరా అన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను ఆ ట్రాఫిక్ పోలీస్ వదిలేలా కనిపించలేదు. అయితే ఆమె పోలీసు నుండి ఎలాగైనా బయట పడాలని అనుకుంది. దీంతో నడిరోడ్డుపై .. అందరు చూస్తుండగానే ఆ పోలీస్ కి ఆమె ముద్దు పెట్టింది. ఈ షాకింగ్ ఘటనను చూసినవారందరు అవాక్కయ్యారు.

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆ అమ్మాయి ఎంతకీ తెగించిందంటూ ముక్కున వేలేసుకున్నారు. ఇక ఈ వీడియో పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ అమ్మాయి ప్లేస్ లో ఒక అబ్బాయి ఉండి.. మహిళా ట్రాఫిక్ పోలీస్ ని ఇలా చేస్తే రేప్ చేసేశాడు అని టార్చర్ చేసేవాళ్ళు.. అమ్మాయి అయ్యే సరికి ఈ వీడియో జోక్ గా మారిందా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలు.. ఒకవేళ పోలీసులు డబ్బులు వద్దంటే.. ముద్దులు ఇవ్వండి అంటూ మరికొందరు కౌంటర్లు వేస్తున్నారు.

Next Story