పంతంగి టోల్ ప్లాజా వద్ద సంక్రాంతి వాహనాల రద్దీ

36

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నగర వాసులంతా గ్రామాల బాటపట్టారు. గత రెండ్రోజుల నుంచి నగర వాసులందరూ గ్రామాలకు వెళ్లడం ప్రారంభించడంతో హైదరాబాద్‌లోని అన్ని బస్టాండ్‌, రైల్వే స్టేషన్లు జనాలతో కిక్కిరిసి పోయాయి. ముఖ్యమంత్రి సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికుల సంఖ్యంగా ఎక్కువగా ఉంటుంది. ఇక హైదరాబాద్‌ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈసారి ఆ ప్రభావం మరింత పెరిగింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు గతంలో మాదిరిగా రైళ్లు, బస్సులు సరిపడ లేకపోవడం, కరోనా కారణంగా నగరవాసులు సొంత వాహనాలు ఏర్పాటు చేసుకోవడంతో నేషనల్‌ హైవేపై వేలాదిగా వెహికిల్స్ బారులు తీరాయి. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగి, బారులు తీసాయి.