అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. స్తంభించిన ట్రాఫిక్

by Batti.Sumithra |

<p>దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ సమీపంలోని నిరంజన్ షా వలి దర్గా వద్ద ఆదివారం ఉదయం శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి&#8230; అచ్చంపేట మండలం గణపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ అమ్రాబాద్ మండలానికి ఇసుకను తరలించి, తిరుగు ప్రయాణంలో వెళుతుండగా ఘాట్ రోడ్డుపై అధిక స్పీడు ఉన్నందున అదుపుతప్పి బోల్తా పడింది అని [&hellip;]</p>

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. స్తంభించిన ట్రాఫిక్
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ సమీపంలోని నిరంజన్ షా వలి దర్గా వద్ద ఆదివారం ఉదయం శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… అచ్చంపేట మండలం గణపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ అమ్రాబాద్ మండలానికి ఇసుకను తరలించి, తిరుగు ప్రయాణంలో వెళుతుండగా ఘాట్ రోడ్డుపై అధిక స్పీడు ఉన్నందున అదుపుతప్పి బోల్తా పడింది అని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ డ్రైవర్ ఒక్కడే ఉండడం… ఎదురుగా సమయానికి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ట్రాక్టర్ డ్రైవర్ సురక్షితంగా ఎలాంటి గాయాలు లేకుండా బ్రతికి బయటపడ్డాడు.

అరగంటకు పైగా స్తంభించిన ట్రాఫిక్…

ఆదివారం సెలవుదినం కావడంతో శ్రీశైలం దైవదర్శనానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ బోల్తా పడడంతో శ్రీశైలం వైపునుండి, హైదరాబాద్ వైపు నుండి పెద్ద ఎత్తున కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Next Story