- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అటవీ శాఖ అధికారులపై… ట్రాక్టర్ డ్రైవర్ దాడి
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం అటవీ ప్రాంతంలో ఇద్దరు బీట్ ఆఫీసర్‌లపై దాడి జరిగింది. ఈ ఘటన రూరల్ పోలీసులకు ఫిర్యాదుతో శుక్రవారం వెలుగుచూసింది. నిజామాబాద్ ఉత్తరం రేంజ్‌కు చెందిన తలారి నవీన్, పృథ్విరాజ్‌లు శుక్రవారం మల్కాపూర్ బీట్ పరిధిలోని మల్లారం అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో మల్కాపూర్‌కు చెందిన విస్లావత్ రమేష్ తన ట్రాక్టర్‌లో అటవీ ప్రాంతంలో ఇసుక తరలిస్తుండగా బీట్ ఆఫీసర్‌లు గమనించి అడ్డుకున్నారు. అనంతరం అధికారులు […]</p>

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం అటవీ ప్రాంతంలో ఇద్దరు బీట్ ఆఫీసర్‌లపై దాడి జరిగింది. ఈ ఘటన రూరల్ పోలీసులకు ఫిర్యాదుతో శుక్రవారం వెలుగుచూసింది. నిజామాబాద్ ఉత్తరం రేంజ్‌కు చెందిన తలారి నవీన్, పృథ్విరాజ్‌లు శుక్రవారం మల్కాపూర్ బీట్ పరిధిలోని మల్లారం అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో మల్కాపూర్‌కు చెందిన విస్లావత్ రమేష్ తన ట్రాక్టర్‌లో అటవీ ప్రాంతంలో ఇసుక తరలిస్తుండగా బీట్ ఆఫీసర్‌లు గమనించి అడ్డుకున్నారు.
అనంతరం అధికారులు రమేశ్‌ను ప్రశ్నించగా, బూతులు తిడుతూ బీట్ ఆఫీసర్ల బైక్‌ను రమేశ్ ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. దీంతో ఆఫీసర్లకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం అధికారులపై కూడా ట్రాక్టర్ ఎక్కించే ప్రయత్నం చేశాడు. ప్రమాదం గమనించి వారు తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం బాధిత మల్లారం బీట్ ఆఫీసర్లు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు.






