3 నెలల విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలి

by  |

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం డిమాండ్

దిశ, న్యూస్‌ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా కుంగిపోతున్నారనీ, ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల విద్యుత్ బిల్లులు తక్షణమే మాఫీ చేయాలని టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

ఈ సందర్భంగా లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. లాక్‌డౌన్‌లో ప్రజలకు ఎటువంటి కాష్టాలు రానివ్వబోమనీ, ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. కాని ఇప్పుడు మాటలతో ప్రజల కడుపు నింపాలని చూస్తున్నారనీ, ప్రజలు కడుపు మాడ్చుకుంటున్నారని దీనిని సీఎం గమనించాలని కోరారు. తెల్ల రేషన్ కార్డు‌దారులకు 6 కేజీల బియ్యం అంటే 6రూ.లు, రూ.1,500 నగదు, మొత్తంగా ప్రజలకు ప్రభుత్వం అందిస్తుంది రూ.1,506మాత్రమేననీ, ఇది కూడా పూర్తిస్థాయిలో అమలుకు నోచడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.986 కోట్లు ఇచ్చినట్లు ప్రకటించిందనీ, వీటితో పాటు రూ.2వేల కోట్ల బాండ్లు, వందల కోట్ల దాతల ద్వారా విరాళాలు వస్తున్నయని పేర్కొన్నారు. కాని ప్రజలకు ఖర్చు చేసిందెంతా అని ప్రశ్నించారు.

Tags: TPCC working president, ponnam prabhakar, writes, letter, to CM KCR

Next Story

Most Viewed