ముళ్లపందిని హతమార్చిన ఇద్దరి అరెస్ట్​

by Sridhar Babu |
ముళ్లపందిని హతమార్చిన ఇద్దరి అరెస్ట్​
X

దిశ, నిజాంపేట్ : అటవీ ప్రాంతంలో ముళ్ల పందిని హతమార్చి తీసుకువెళ్తున్న ఇద్దరు నిందితులను ఆదివారం అటవీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు అధికారులు మాట్లాడుతూ బాగిర్తిపల్లి గ్రామానికి చెందిన నేల శ్రీహరి, వెల్దుర్తికి చెందిన అశాల సంతోష్ అనే ఇద్దరు నేరస్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక ముళ్లపందిని, బైక్ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు వైద్య పరీక్షల నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించి మెదక్ కోర్టులో జడ్జి ముందు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కేసులో రామాయంపేట రేంజ్ అధికారి సయ్యద్ కతుబుద్దీన్, ఎఫ్బిఓలు రాము , నవీన్, రమేష్ ఉన్నారు.

Next Story

Most Viewed