స్థానిక సంస్థలకు పోటీ చేసే అభ్యర్థుల గాలం..

by Aamani |
స్థానిక సంస్థలకు పోటీ చేసే అభ్యర్థుల గాలం..
X

దిశ,శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న తాజా మాజీ ప్రజాప్రతినిధులు అదే విధంగా నూతనంగా పోటీ చేసే ఆశావాహులు అందలం ఎక్కడం కోసం వారి వారి ప్రయత్నాలు మొదలు పెట్టారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పల్లెల్లో ఎన్నికల కంటే ముందే గ్రామాలలో వారి బలాలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే, కులాల వారిగా వర్గాల వారీగా మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.జడ్పీటీసీ కి పోటీ చేయాలనే కోరికతో ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో మందు దావత్ ఏర్పాటు చేసినట్లు మండలం లో చర్చ జరుగుతుంది. తాను జడ్పీటీసీ గా పోటీ చేస్తే మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ మందు పార్టీ ఇచ్చినట్లు సమాచారం ఎంపీటీసీ ఆశావాహులు సర్పంచ్ ఆశావాహులు పోటీ చేయాలనే కోరిక ఉన్న వ్యక్తులు గ్రామాలలోని ప్రజలతో మమేకమవుతూ విందులు వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. చూడాలి మరి ఈ విందులు వినోదాలు గట్టు ఎక్కిస్తాయా.. ?

Next Story

Most Viewed