స్టార్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్.. హాట్ టాపిక్‌గా మారిన అలియా భట్ డెనిమ్ జీన్స్ టాప్‌ ధర

by Hamsa |
స్టార్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్.. హాట్ టాపిక్‌గా మారిన అలియా భట్ డెనిమ్ జీన్స్ టాప్‌ ధర
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పెళ్లై ఓ కూతురు ఉన్నప్పటికీ గ్లామర్ ట్రీట్ విషయంలో తగ్గేదెలా అన్నట్లు ప్రవర్తిస్తోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ ఉంటుంది. అలాగే నేటి ట్రెండ్‌కు తగినట్లుగా ట్రెండీవేర్ దుస్తుల్లో దర్శనమిస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. తాజాగా, అలియా భట్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. స్లీవ్ లెస్‌తో ఉన్న డెనిమ్ జీన్స్ టాప్‌లో దర్శనమిచ్చింది. ఇందులో వీపు భాగం కనిపించేలా స్టిల్స్ ఇచ్చి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది.

ఓర చూపులతో స్టన్నింగ్ స్టిల్స్ పెట్టి కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. అలాగే ‘జస్ట్ అదర్ స్మార్ఫ్’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం అలియా భట్ ధరించిన డ్రెస్ ధర నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. డెనిమ్ బాడీ కాన్ మిడీ డ్రెస్ ధర ఏకంగా రూ. 1. 37 లక్షలు అని సమాచారం. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాని గురించి తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు. అంత సింపుల్ డ్రెస్‌కి అన్ని డబ్బులు ఖర్చు పెట్టిందా? అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed