‘నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని.. అస్సలు ఊరుకోను’.. BJP ఎమ్మెల్యేకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

by Satheesh |
‘నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని.. అస్సలు ఊరుకోను’.. BJP ఎమ్మెల్యేకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: తాను రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూల్ చేస్తు్న్నానంటూ బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గాంధీభవన్‌లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వినతిపత్రాలు తీసుకొచ్చి సీఎం దగ్గరికి పోయి.. లోపలికి వెళ్లాక ల్యాండ్ సెటిల్‌‌మెంట్ విషయాలు మాట్లాడినట్లు కాదని మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సచివాలయానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఇక, బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి కోసం ఆయనే ఢిల్లీకి డబ్బులు పంపినట్టు ఉన్నారని అన్నారు. తాను వెయ్యి కోట్లు తీసుకున్నానని మాట్లాడుతున్నారు, కానీ నేను ఎవరి దగ్గర నయా పైసా కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.

తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికైనా ఇలాంటి నీచపు మాటలు మానుకోవాలని చురకలంటించారు. ఢిల్లీకి డబ్బులు పంపించే సంస్కృతి బీజేపీకి ఉందని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ మాటల్లో నిజం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.200 కోట్ల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని, అలాంటిది ధాన్యం కొనుగోళ్లలో రూ.2 వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందని మంత్రి ప్రశ్నించారు. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డినని.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే అస్సలు ఊరుకోనని హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని, రూ.11 వేల కోట్ల అప్పుల్లో ముంచిందని ఫైర్ అయ్యారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో అవినీతి లేదని, రైతులకు మేలే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైస్ మిల్లర్ల విషయంలో రూల్స్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సివిల్ సప్లై శాఖలో వందల కోట్ల అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణల్లో నయా పైసా నిజం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేశామని తెలిపారు.

Next Story

Most Viewed