ఎస్టీ, ఎస్సీలు ఎదిగితే కేసీఆర్ సహించరు: ఉత్తమ్

by  |
ఎస్టీ, ఎస్సీలు ఎదిగితే కేసీఆర్ సహించరు: ఉత్తమ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎస్టీ, ఎస్టీల్లో ఎవరైన ఎదిగితే సీఎం సహించరని, టీఆర్ఎస్‌లో మొదట్నుంచి ఉండి, జెండా మోసిన వారిని మోసం చేశారని విమర్శించారు. గిరిజన రిజర్వేషన్ల కోసం నిరసన దీక్షకు దిగిన రాములు‌నాయక్‌తో గురువారం దీక్ష విరమింపజేసిన ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల పేరుతో గిరిజనులను కేసీఆర్ మోసం చేస్తున్నారని, అధికారంలోకి వచ్చి ఆరేళ్లు అయినా రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదని మండిపడ్డారు. జనాభా ఆధారంగా గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వాటిని సాగు చేసుకునే హక్కును గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. కేంద్రం పేరు చెప్పి గిరిజనులు, బీసీలను మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సూచనలతో పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు బిల్లులు, కరోనా కట్టడి చర్యలపై చర్చించేందుకు సీఎంను, మంత్రులను కలిసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్‌ 10 వేల మందితో కొండపోచమ్మ ప్రాజెక్టును ప్రారంభించారని, మంత్రి కేటీఆర్‌ వేలాది మందితో సిరిసిల్లలో జలహారతి కార్యక్రమం చేశారన్నారు. వాళ్లను అడ్డుకోలేని పోలీసులు కాంగ్రెస్‌ నేతలనే ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు.


Next Story

Most Viewed