బీఆర్ఎస్‌కు అలవాటుగా శవ రాజకీయాలు: మంత్రి పొన్నం ఫైర్

by Disha Web Desk 19 |
బీఆర్ఎస్‌కు అలవాటుగా శవ రాజకీయాలు: మంత్రి పొన్నం ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌కు శవ రాజకీయాలు అలవాటుగా మారాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. చేనేత కార్మికులు చనిపోవడానికి నాలుగు నెలలు క్రితం ఏర్పడిన ప్రభుత్వం తప్పిదంగా బీఆర్ఎస్ బ్లేమ్ చేస్తుందన్నారు. ఉద్యమం సమయంలోనూ ఇలాంటి చీఫ్​ట్రిక్స్ చేశారని మండిపడ్డారు. కానీ తాము ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికుల పూర్తి వివరాలను సేకరించి, చావుకు ఇతర కారణాలు ఉన్నాయా..? అనే దానిపై ఎంక్వైరీ చేస్తామన్నారు. అంతేగాక ఆయా కుటుంబాలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతన్నలను ఆదుకునేది కాంగ్రెస్ మాత్రమేనని అని వివరించారు. బీఆర్ఎస్ పదేళ్లలో బిల్లులు చెల్లించకపోవడం వలనే ప్రస్తుతం చేనేత కార్మికులు మనోదైర్యాన్ని కోల్పోయారన్నారు.

గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో 12 వేల నేతన్నల కుటుంబాలకు 35 కిలోలు ఇచ్చే బియ్యం కార్డులు అందజేశామన్నారు. కానీ బీఆర్ఎస్ పవర్‌లోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసిందన్నారు. 2004-2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను పార్లమెంట్ సభ్యుడిగా సిరిసిల్ల నేతన్నలకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. మహిళలకు, చేనేత కార్మికులకు ఆరోగ్యానికి సంబంధించిన యాక్టివిటీస్ నిర్వహించామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి దశలో రూ. 50 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించామని, ఒకటి రెండు రోజుల్లో మరో రూ. 50 కోట్లు పెండింగ్ బకాయిలు రిలీజ్ చేస్తున్నామన్నారు. ఇవన్నీ పాత బకాయిలే అన్నారు.

చేనేత కార్మికుల తయారు చేసిన క్లాత్‌ను స్కూల్ యూనిఫామ్‌లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర అవసరాల నిమిత్తం వినియోస్తామని ఇప్పటికే జీవో కూడా రిలీజ్ చేశామన్నారు. నేతన్నలు ఎవరూ అధైర్యపడొద్దని కోరారు. భవిష్యత్‌లో నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ బ్రాంచ్ పెట్టే విధంగా కృషి చేసి మోడలైజేషన్ చేస్తామన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం దేశంలో 4 క్లస్టర్‌లు ఇస్తే, సిరిసిల్లకి ఒక్కడి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 40 వేల పవర్ లూమ్స్ ఉంటే, 30 వేలు ఒక్క సిరిసిల్లలోనే ఉన్నాయని గుర్తు చేశారు. కానీ క్లస్టర్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ ఎంపీ కూడా కనీసం నోరుమెదపలేదన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed