ముగిసిన మూడో దశ ఎన్నికల పోలింగ్.. 5 గంటలకు 60.19% ఓటింగ్ నమోదు

by Disha Web Desk 12 |
ముగిసిన మూడో దశ ఎన్నికల పోలింగ్.. 5 గంటలకు 60.19% ఓటింగ్ నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగింది. మొత్తం 9 రాష్ట్రాల్లోని 93 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కాగా సాయంత్రం ఐదు గంటల వరకు 60.19% ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. అలాగే రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. అస్సాం - 74.86%, బీహార్ - 56.01%, ఛత్తీస్‌గఢ్ - 66.87%, గోవా - 72.52%, గుజరాత్ - 55.22%, కర్ణాటక - 66.05%, మధ్యప్రదేశ్ - 62.28%, మహారాష్ట్ర - 53.40%, ఉత్తర ప్రదేశ్ - 55.13%, పశ్చిమ బెంగాల్ - 73.93%, దాద్రా, నగర్ హవేలీ, డామన్-డయ్యూ - 65.23% నమోదైంది. ఇది సాయంత్రం ఐదు గంటల వరకు నమోదైన ఓటు శాతం కాగా ఇంకా క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో ఈ పోలింగ్ శాతం, మొదటి, రెండో దశ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా మొదటి దశలో 66.14%, రెండవ దశలో 66.71% పోలింగ్‌ నమోదైంది.ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్- రాజౌరీ లోక్ సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరగాల్సి ఉండగా నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో.. హిమపాతం ఏర్పడే అవకాశం ఉందని మే 25 పోలింగ్ ను పోస్ట్‌ఫోన్ చేశారు.

Next Story

Most Viewed