- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీకి టీడీపీ మద్దతు
దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం బీజేపీ పార్లమెంటు అభ్యర్థి తాండ్ర వినోద్రావుకి టీడీపీ మద్దతు ఇచ్చింది. మంగళవారం తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యాల యంలో ఖమ్మం పార్లమెంటు అధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మద్దతును ప్రకటించారు. ముందుగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తో పొత్తులో భాగస్వామ్యమై వెళ్తున్న సందర్భంగా తెలంగాణలో కూడా ఎన్డీఏకు తెలుగుదేశంపార్టీ మద్దతిస్తుందని తెలిపారు.
తెలంగాణలో టీడీపీ అభ్యర్థి పోటీలో లేనందున ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తాండ్ర వినోద్‌రావు కి అధిష్టానం నిర్ణయం ప్రకారం కార్యకర్తలు ఓటు వేసి పూర్తి మద్దతు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండబాల కర్ణాకర్, మల్లాది హనుమంతరావు, కేతినేని హరీష్, కన్నేటి పృథ్వీ, మల్లెంపాటి అప్పారావు, కాపా కృష్ణ మోహన్, కనుకుంట్ల కుమార్, గుత్తా సీతయ్య, చేకూరి చలపతిరావు, ఆరెం వరలక్ష్మి, చుండూరు రాజేశ్వరి, మేడేపల్లి రాణి, కల్యాణపు లక్ష్మీపతి, బీజేపీ నాయకులు కనగాల వెంకటరామయ్య, తదితరులు పాల్గొన్నారు.