Y. S. Vivekananda Reddy: వివేకా హత్యతో అవినాష్‌కు సంబంధం ఉందా..? అంటే..?

by Disha Web Desk 3 |
Y. S. Vivekananda Reddy: వివేకా హత్యతో అవినాష్‌కు సంబంధం ఉందా..? అంటే..?
X

దిశ వెబ్ డెస్క్: వై.ఎస్. వివేకానందరెడ్డి మరణించి ఇప్పటికి 5 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. న్యాయం కోసం ఆయన కూతురు వైఎస్ సునీత పోరాడుతూనే ఉంది. కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు నిమ్మలంగా ఉందని పలు సందర్భాలలో వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

అలానే తన తండ్రి హత్యను దాచేసి ఎందుకు గుండెపోటుతో చనిపోయారనే వదంతులు పుట్టించారో సమాధానం చెప్పాలని సీఎం జగన్‌ను నిలదీశారు. సీబీఐ హంతకులు వీరే అని చూపిస్తున్నా ఎందుకు నమ్మడం లేదని, హంతకులకు ఎందుకు అండగా ఉంటున్నారో చెప్పాలి అని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అసలు ఏ ఆధారాలతో వైఎస్ సునీత వైఎస్ వినాష్‌‌ను హంతకుడు అని అంటున్నారు..?

వివేకా హత్యతో అవినాష్‌కు సంబంధం ఉందా..? ఉంటే ఎందుకు సీఎం జగన్ అవినాష్‌‌కు అండగా ఉన్నారు..? వివేకా హత్య కేసులో జగన్ హస్తం కూడా ఉందా..? అందుకే అవినాష్‌‌‌కు జగన్ అండగా ఉన్నా్రా..? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వై.ఎస్.వివేకానందరెడ్డికి, అవినాష్‌ మధ్య ఫోన్‌కాల్స్

వై.ఎస్.వివేకానందరెడ్డి మరణించడానికి ముందు అవినాష్‌‌తో అనేకసార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు కాల్ హిస్టరీ లభ్యమైనట్లు సీబీఐ పేర్కొంది. అలానే వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు గురైన సమయంలో అవినాష్‌ అక్కడే ఉన్నట్టు గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా మ్యాచ్ అయ్యింది.

వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి

వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన దస్తగిరి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన సంచలన విషయాలను దస్తగిరి బయటపెట్టారు. ఒక ప్లాన్ ప్రకారమే వివేకానందరెడ్డిని హత్య చేసినట్టు వెల్లడించారు. వివేకానందరెడ్డిని హత్య చేస్తే అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి డబ్బులు ఇస్తారని, కేసు కాకుండా చూసుకుంటారని గంగిరెడ్డి భరోసా ఇచ్చినట్టు దస్తగిరి తెలిపారు.

అనంతరం తాను, ఎర్రగంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి కలిసి వివేకానందరెడ్డిని హత్య చేయగా, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కలిసి సాక్ష్యాల ధ్వంసం చేసినట్టు తెలిపారు.

అవినాష్‌‌ను హంతకుడిగా చూపిస్తున్న మరికొన్ని సాక్ష్యాలు

కాల్‌ డేటా, గూగుల్‌ టేకౌట్‌, సీసీటీవీ ఫుటేజీలు, వైఫై సమాచారం, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలు.

ఇన్ని సాక్ష్యాలు ఉన్న అవినాష్‌‌కు జగన్ ఎందుకు అండగా ఉంటున్నారు?

2019 ఎన్నికల నేపథ్యంలో సింపతీ ఓట్లతో గెలిచేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నానను చంపిచారు అనే ఆరోపనలు ఉన్నాయి. అలానే వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాని మొదట చెప్పింది జగన్, ఆ తరవాత గొడ్డలితో నరకడం కారణంగానే చనిపోయారు అని చెప్పింది కూడా జగన్, ఎందుకు అలా చెప్పారు? అలానే ఎవరికీ తెలియక ముందే గొడ్డలితో నరకడం కారణంగానే వివేకానందరెడ్డి చనిపోయారు అనే విషయం జగన్‌కి ఎలా తెలిసింది అని వైఎస్ సునీత ప్రశ్నించారు.

ఇలా వైఎస్ సునీత ప్రశ్నలు అడగగా, ఆ ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్నకు జగన్ సరైన సమాధానం చెప్పలేకపోయారని, కచ్చితంగా వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు జగన్‌కు ఏదో సంబంధం ఉంది, అందుకే అవినాష్‌‌కు జగన్ అండగా ఉంటున్నారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా వివేకా హత్యలో ఏ9 పేరును సైతం చేర్చే అవకాశం ఉందని మొదట్లో వార్తలు వచ్చినా, దర్యాప్తు సంస్థ మాత్రం చార్జిషీటులో ఏ9 గురించి ప్రస్తావించలేదు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed