- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు, ఎల్లుండి సీఎం సమీక్ష..! టాపిక్స్ ఏంటంటే..?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: రేపు, ఎల్లుండి ఇంజినీరింగ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వంహిచనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో నూతన సచివాలయం నిర్మాణం, నీటి పారుదల శాఖపై చర్చించనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు నీటిపారుదల శాఖపై, ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు ఆర్అండ్ బీ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. నీటిపారుదల శాఖ పునర్ వ్యవస్థీకరణ ముసాయిదాపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా నూతన సచివాలయ నిర్మాణంపై చర్చించనున్నారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రేపు, ఎల్లుండి ఇంజినీరింగ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వంహిచనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో నూతన సచివాలయం నిర్మాణం, నీటి పారుదల శాఖపై చర్చించనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు నీటిపారుదల శాఖపై, ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు ఆర్అండ్ బీ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. నీటిపారుదల శాఖ పునర్ వ్యవస్థీకరణ ముసాయిదాపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా నూతన సచివాలయ నిర్మాణంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు పాల్గొననున్నారు. సచివాలయం బాహ్యరూపం, అందులో సౌకర్యాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అనంతరం ఆ నిర్ణయాలను మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి నూతన నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది.
Next Story






