వామ్మో టమాట.. మరీ రూ.120 ధర‌నా ?

by  |
వామ్మో టమాట.. మరీ రూ.120 ధర‌నా ?
X

దిశ, పరకాల: టమాట ధర చుక్కలు చూపిస్తోంది. పరకాల మార్కెట్లో గరిష్టంగా 120 రూపాయల ధర పలికి సెంచరీ దాటడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రతిరోజు సుమారు 10 నుంచి 15 టన్నుల టమాట మార్కెట్ కు రావాల్సి ఉండగా రాష్ట్రానికి సంబంధించిన కరీంనగర్ వరంగల్ సిద్దిపేట ఒంటిమామిడి జిల్లాల్లో గత వర్షాల మూలంగా టమాట సాగు ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. దీంతో ప్రస్తుతం పరకాల మార్కెట్‌కు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి సరఫరా అవుతుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు, మదనపల్లి జిల్లాల నుండి రావలసిన టమాట ట్రాన్స్ పోర్ట్ సమస్యతో పూర్తిగా నిలిచిపోయింది. దీంతో నిత్యం పరకాలకు 10 – 15 టన్నుల టమాటా సరఫరా అయ్యే క్రమంలో 5 నుంచి 6 టన్నులకు పడిపోయింది. నిత్యం ఏదో ఒక వంటకాల్లో తప్పనిసరిగా వాడే టమాట అనూహ్యంగా రేటు పెరగడంతో వినియోగదారులు టమాట ధరలు చూసి షాక్ గురవుతున్నారు.


Next Story

Most Viewed