టాలీవుడ్ చందమామ..HAPPY BIRTHDAY KAJAL AGARWAL

by  |
టాలీవుడ్ చందమామ..HAPPY BIRTHDAY KAJAL AGARWAL
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ పంచాదార బొమ్మ కాజల్ అగర్వాల్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రల్లో నటించి, టాలీవుడ్‌ అగ్రహీరోలందరితోనూ ఆడిపాడింది. తెలుగు టాప్ హీరోయిన్ల జాబితాలో ఒకరిగా ఉన్న కాజల్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాలో నటిస్తోంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. సినిమాల్లో మళ్లీ నటిస్తుందా అనే ప్రశ్నలు అభిమానులకు రాకుండానే.. పలు సినిమాలకు ఓకే చెప్పి.. అభిమానులను ఏమాత్రం నిరాశ చెందకుండా సర్‌ప్రైజ్ చేసింది. కారెక్టర్ నచ్చితే ఏం చేయడానికైనా సిద్ధమే అంటుంది చందమామ.

తెలుగులో 'చందమామ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కాజల్.. అందులో అద్భుమైన పర్ఫామెన్స్ చేసి అందరినీ మెప్పించింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన 'మగధీర' సినిమాలో నటించి, తన టాలెంట్ ఏంటో నిరూపించింది. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి.. టాలీవుడ్ టాప్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'సర్ధార్ గబ్బర్ సింగ్', మహేశ్ బాబుతో 'బిజినెస్ మెన్', ప్రభాస్‌తో 'డార్లింగ్', ఎన్టీఆర్‌తో టెంపర్, అల్లు అర్జున్‌తో ఆర్యా-2 సినిమాల్లో నటించి అగ్రహీరోలందరితో ఆడిపాడి మెప్పించింది.

మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ ఫిలిం 'ఖైదీ నెంబర్-150' లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సీనియర్, జూనియర్ హీరోలందరికీ బెటర్ ఛాయిస్‌గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య' సినిమాలో, కమల్ హాసన్‌తో 'భారతీయుడు 2' మూవీలో నటిస్తోంది. అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ అగర్వాల్ విగ్రహాన్ని ఉంచడం అమ్మడికి దక్కిన అరుదైన గౌరవం. ఈ మ్యూజియంలో స్థానం సంపాదించిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్‌గా కాజల్ రికార్డు సృష్టించింది. అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, మహేష్ బాబు, ప్రభాస్, కాజోల్, కరీనా కపూర్ విగ్రహాలతో పాటు కాజల్ విగ్రహాన్ని ఉంచడం విశేషం. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన కాజల్ శనివారం జూన్ 19న తన 36 జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది.

Next Story

Most Viewed