శ్రీకాంత్ vs నరేష్.. తారాస్థాయికి ‘మా’ డబ్బుల వివాదం

by  |
Srikanth, Naresh
X

దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల వివాదం తారస్థాయికి చేరింది. రాజకీయ నాయకులకు ఏమాత్రం తీసిపోకుండా.. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా.. నటుడు నరేష్ మరోసారి ప్రకాశ్ రాజ్ ప్యానల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని శనివారం వీడియో విడుదల చేశాడు. ఓటుకు రూ.10 నుంచి రూ.25 పంచుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. డబ్బుల పంపిణీకి మూడు సెంటర్లు ఏర్పాటు చేశారని అన్నారు. తాను అబద్ధాలు చెప్పనని, తాను చెప్పే ప్రతీది నిజమే అని వెల్లడించారు. మేనిఫెస్టో విడుదల చేయకుండా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.

తాజాగా.. నటుడు నరేష్ ఆరోపణలకు హీరో శ్రీకాంత్ కౌంటర్ ఇచ్చారు. నరేష్ మద్దతు ఇస్తున్న ప్యానల్ సభ్యులే డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే ‘మా’లో చాలా డబ్బులు కాజేసి, నాశనం చేశారని అన్నారు. నరేష్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, మేము మందు బాటిళ్లు ఇవ్వడం లేదు.. డబ్బులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. మేము డబ్బులు పంచినట్లైతే అమ్మవారే నాశనం చేస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



Next Story