- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. పూల్-A మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3-2 గోల్స్ తేడాతో గెలుపొందింది. అటు ఆర్చరీ మిక్స్ డ్ టీమ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ అద్భుత విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణ కొరియాతో భారత్ తలపడే అవకాశముంది. అయితే 10 మీ.ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్‌లో భారత్‌కు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. పూల్-A మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3-2 గోల్స్ తేడాతో గెలుపొందింది. అటు ఆర్చరీ మిక్స్ డ్ టీమ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ అద్భుత విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణ కొరియాతో భారత్ తలపడే అవకాశముంది.
అయితే 10 మీ.ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. భారత మహిళా షూటర్లు ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. 626.5 పాయింట్లతో ఎలవెనిల్ వలేరియన్ 16వ స్థానంలో, 621.9 పాయింట్లతో అపూర్వి చందేలా 36వ స్థానంలో నిలిచారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో చైనాకు తొలి స్వర్ణ పతకం లభించింది. 10 మీ.ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో యాంగ్ క్వియాన్ స్వర్ణం దక్కించుకుంది.
- Tags
- HOCKEY TEAM
- india
Next Story






