ఐపీఎల్‌లో నేడు… హైదరాబాద్ vs ఢిల్లీ

by  |
ఐపీఎల్‌లో నేడు… హైదరాబాద్ vs ఢిల్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరు జరుగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఇప్పటికే ప్లేఆఫ్స్ స్థానాన్ని క్లిష్టతరం చేసుకున్న హైదరాబాద్ జట్టు.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీతో తలపడబోతున్నది. కోల్‌కతాపై పంజాబ్ గెలవడంతో హైదరాబాద్‌కు ప్లేఆఫ్స్ ఆశలు చిగురించాయి. అయితే ఇదే వికెట్‌పై గత మ్యాచ్ ఆడిన హైదరాబాద్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. వికెట్లను నిర్లక్ష్యంగా పారేసుకోవడమే జట్టుకు పెద్ద మైనస్‌ అయింది. ఈ లోపాన్ని అధిగమిస్తే విజయం ఖాయమే.

వరుస విజయాలు సాధిస్తూ టేబుల్ టాపర్‌గా నిలవాల్సిన ఢిల్లీ జట్టు గత రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం కలవరపెడుతున్నది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో బలంగా ఉన్న జట్టుకు ఇప్పుడు ఓటములే పెద్ద ఇబ్బందిగా మారింది. జట్టు మరో విజయం సాధిస్తే కాని పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం దక్కేలా లేదు. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇరు జట్లు చూస్తున్నాయి. మరి ఏ జట్టుపై ఏ జట్టు పై చేయి సాధిస్తుందో వేచి చూడాలి.



Next Story

Most Viewed